SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పిల్లలకు 10వ తరగతి వరకు ఉచిత విద్య..!!

Singareni Free Education: సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. సింగరేని కాలరీస్ సంస్థలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Written By Bhoomi
Published: Nov 25, 2026, 09:11 IST | Updated: Nov 25, 2026, 09:12 IST
Image Credit: Singareni Free Education:
Join

Singareni Free Education: సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. సింగరేని కాలరీస్ సంస్థలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. కార్మికుల పిల్లలకు సింగరేణి విద్యాసంస్థల్లో టెన్త్ వరకు పూర్తిగా ఫ్రీ ఎడ్యుకేషన్ అందించనున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేత్రుత్వంలో జరిగిన కోల్ బెల్ట్ ప్రజాప్రతినిధుల భేటీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ స్కీమ్ ను అమలు చేయనున్నారు. దీని వల్ల సంస్థలోని 12ఏరియాల్లో పనిచేస్తున్న దాదాపు 30వేల మంది కార్మికుల కుటుంబాలకు మేలు జరుగుతుంది. సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వహిస్తున్న 9 బడుల్లో ప్రస్తుతం చదువుతున్న 400 మందికిపైగా విద్యార్థులకు ఈ సదుపాయం వెంటనే వర్తిస్తుంది.

ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ స్కీమ్ ను అమలు  చేయాలని కోరుతూ సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ జనరల్ మేనేజర్ అన్ని ఏరియాలకు అధికారిక ఆదేశాలు జారీ చేశారు. సింగరేణి పరిధిలోని బడుల్లో కార్మికుల పిల్లలకు ఉచిత ప్రవేశాలతోపాటు టెన్త్ వరకు రూపాయి ఖర్చు లేకుండా చదువుకునే అవకాశం కల్పించారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా అడ్మిషన్లు తీసుకునే విద్యార్థులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుండటంతో సింగరేణి బడుల్లో చేరే వారి సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్ ఉంది.

ఉచిత విద్య దరఖాస్తుకు సమర్పించాల్సిన ధ్రువీకరణ పత్రాలు ఇవే: 
ఉచిత విద్యా సదుపాయాన్ని పొందాలనుకునే కార్మికులు కొన్ని ముఖ్యమైన పత్రాలను సమర్పించాలని విద్యాశాఖ అధికారులు సర్క్యూలర్ లో స్పష్టం చేశారు.

- కార్మికుడి గుర్తింపు కార్డుతోపాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు
-విద్యార్థి ఆధార్ కార్డు
-ప్రభుత్వం జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఈ పత్రాలన్నింటిని సంబంధిత సింగరేణి హెచ్ఓడీల ద్వారా ధ్రువీకరించి పాఠశాలల్లో అందించాలి.

ప్రైవేట్ ఫీజుల భారం నుంచి విముక్తి: 
ప్రైవేట్ బడుల్లో వేలకు వేలు ఫీజులు చెల్లించలేని కార్మికులను ద్రుష్టిలో పెట్టుకుని యాజమాన్య నిర్ణయం పెద్ద ఊరటనిస్తోంది. ఇప్పటికే కాంట్రాక్టు కార్మికులకు రూ. 5,500 చొప్పున లాభాల వాటా బోనస్ అందించి అండగా నిలిచిన సంస్థ..ఇప్పుడు వారి పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. తమ పిల్లల చదువు భారాన్ని తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి యాజమాన్యానికి కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికులు క్రుతజ్నతలు తెలుపుతున్నారు. 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES