• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Singareni Student Suicide: సింగరేణిలో షాకింగ్ ఘటన.. లైంగిక వేధింపులు ఇంటర్న్ విద్యార్థిని ఆత్మహత్య.!.

Singareni Student Suicide: సింగరేణిలో షాకింగ్ ఘటన.. లైంగిక వేధింపులు ఇంటర్న్ విద్యార్థిని ఆత్మహత్య.!.

Singareni intern Engineer Suicide: గత కొన్ని రోజులుగా తనను ఓవర్ మ్యాన్ రవికుమార్ వేధింపులకు గురిచేస్తున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలోనే సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. గోదావరి ఖనిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది.

Reported ByInamdar PareshEdited ByInamdar Paresh
Published: Sep 16, 2026, 10:40 AM IST|Updated: Sep 16, 2026, 10:51 AM IST
joinshare
Singareni Student Suicide: సింగరేణిలో షాకింగ్ ఘటన.. లైంగిక వేధింపులు  ఇంటర్న్ విద్యార్థిని ఆత్మహత్య.!.
Image Credit: singarenigirlsuicide

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Singareni intern Engineer student commits suicide: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కామాంధులు మాత్రం మారడంలేదు. ప్రతిరోజు అత్యాచారం ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. ఈ క్రమంలో పసిపాపల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు వేధింపులకు గురౌతున్న ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద పల్లి జిల్లా గోదావరి ఖనిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. లైంగిక వేధింపులతో సింగరేణి ఇంటర్న్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.  ఈ ఘటన స్థానికంగా తీవ్ర వివాదంగా మారింది.

 

లైంగిక వేధింపులతో సింగరేణి ఇంటర్న్ విద్యార్థిని ఆత్మహత్య

తనను ఓ అధికారి రేప్ చేశాడని సూసైడ్ నోట్‌లో పేర్కొన్న విద్యార్థిని

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో డిప్లొమా పూర్తి చేసి, ఈసెట్ ద్వారా ఉస్మానియాలో ఇంజనీరింగ్ సీటు సాధించి, ఇంటర్న్‌షిప్ కోసం ఈ… pic.twitter.com/FMj3CVaGep

— Telugu Scribe (@TeluguScribe) September 16, 2026

 

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో డిప్లొమా పూర్తి చేసి, ఈసెట్ ద్వారా ఉస్మానియాలో ఇంజనీరింగ్ సీటు సాధించి, ఇంటర్న్‌షిప్ కోసం ఈ ఏడాది సింగరేణి సంస్థలో  చేరింది. అయితే..అదే కాలేజీలో ఓవర్ మ్యాన్ రవికుమార్ ఆమెపై కన్నేశాడు. తరచుగా ఆమెను వేధింపులకు గురిచేస్తుండేవాడు. దీనిపై ఎన్నిమార్లు చెప్పిన అతను వేధింపులు ఆపలేదు. 

ఈ క్రమంలో కాలేజీ యాజమాన్యంకు చెప్పిన కూడా పట్టించుకోలేదు. దీంతో  యువతి సూపర్ వైజర్ రవికుమార్, నవీన్ ల వేధింపులకు తాళలేక పురుగుల మందు తాగి   ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన కాలేజీ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ యువతి దుర్మరణం చెందింది. ఈ ఘటనతో యువతి తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని గుండెలు పగిలేలా రోదించారు. తన కూతురికి నవీన్ , రవీ కుమార్ లు వేధిస్తున్నారని చెప్పిన సిబ్బంది పట్టించుకోలేదన్నారు. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 అప్పటికే  రవి, నవీన్ లు ఇద్దరు పరారయ్యారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు బాధితురాలు చనిపోయే ముందు రాసిన సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది.  దానిలో తనను రవీకుమార్, నవీన్ లు ఏవిధంగా హింసించారో, వేధింపులకు గురిచేశారో రాసుకొచ్చింది. ఈ ఘటనతో దళిత సంఘాలన్ని సింగరేణి కాలేజీ వద్దకు చేరుకున్నాయి. 

విద్యార్థిని ఆత్మహత్యకు బాధ్యులైన సింగరేణి అధికారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, దళిత సంఘాల ఆధ్వర్యంలో కార్పొరేషన్ ఆఫీస్ రహదారిపై మృతదేహంతో బైఠాయించి ధర్నా చేపట్టాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతం తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News