• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /దానం నాగేందర్‌కు సుప్రీంలో చుక్కెదురు.. అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు! ఇక నెక్స్ట్ ఏంటి?

దానం నాగేందర్‌కు సుప్రీంలో చుక్కెదురు.. అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు! ఇక నెక్స్ట్ ఏంటి?

సుప్రీంకోర్టులో దానం నాగేందర్‌కు భారీ షాక్ తగిలింది. రాష్ట్ర హైకోర్టులో తనపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను కొట్టేయాలని కోరుతూ ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు ఈ అంశంపై సమగ్ర విచారణను నిర్వహించి, చివరకు దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కీలక తీర్పుతో ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయమైనట్లు స్పష్టమవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Sep 24, 2026, 12:38 PM IST|Updated: Sep 24, 2026, 01:13 PM IST
joinshare
దానం నాగేందర్‌కు సుప్రీంలో చుక్కెదురు.. అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు! ఇక నెక్స్ట్ ఏంటి?
Image Credit: Supreme Court Dismisses MLA Danam Nagender’s Plea:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Supreme Court Dismisses MLA Danam Nagender’s Plea: తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలన పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడు అని ప్రకటించిన తెలంగాణ హైకోర్టు తీర్పు నేపథ్యంలో, ఆయన ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈరోజు దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. రాష్ట్ర హైకోర్టు తనపై వేసిన అనర్హత పిటిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై ఇవ్వాలా విచారణ జరిపారు. ఈ విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఆయన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తీర్పునిచ్చింది.

ఈ సందర్భంలో హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది. ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్, 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. దీనివల్ల ఆయనపై అనర్హత విధించాలని కోరుతూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదులు చేశారు. అయితే, చట్టపరమైన నిబంధనల ప్రకారం దానం పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదని గతంలో మార్చి 11న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు సవాలు చేశారు. చివరకు సుదీర్ఘమైన విచారణ చేపట్టిన హైకోర్టు, ఈరోజు ఈ మేరకు కీలకమైన ఉత్తర్వులను జారీ చేసింది.

గత 2023 సంవత్సరంలో ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగి విజయవంతంగా గెలుపొందారు. అయితే, ఆ తర్వాత రాజకీయ నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీ కండువా పుచ్చుకుని, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలవడంతో, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి వేర్వేరుగా పిటిషన్లను దాఖలు చేస్తూ పెద్ద యుద్ధానికి తెరలేపారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలను దానం నాగేందర్ ఉల్లంఘించారని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిణామాల క్రమంలోనే తెలంగాణ హైకోర్టు ఆయనను ఎమ్మెల్యేగా అనర్హులుగా ప్రకటించింది. అయితే, ఈ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈరోజు జరిగిన సమగ్ర విచారణలో సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పును ఇస్తూ, హైకోర్టు నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించింది.

ఖైరతాబాద్‌ ఉప  ఎన్నిక ఖాయం..
హై కోర్టు దానం నాగేందర్‌ పార్టీ ఫిరాయింపులు ఉల్లంఘించారని 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇతర పార్టీ తరఫున పోటీ చేసినప్పటి నుండి ఆయనపై అనర్హత నిబంధనలు అమల్లోకి వస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనివల్ల ఖైరతాబాద్ అసెంబ్లీ సీటు ఖాళీ అయినట్లు స్పీకర్‌కు, ఎన్నికల కమిషన్‌కు తక్షణమే సమాచారం అందించాలని కూడా ఆదేశించింది. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్థించడంతో ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News