SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తలుపులు, లైట్లు లేని టాయిలెట్లు.. హైదరాబాద్ బస్తీల్లో ఆడపిల్లల పీరియడ్స్ కష్టాలపై షాకింగ్ రిపోర్ట్..!!

Teenage Girls Period Problems: హైదరాబాద్ నగరంలో సంపన్న ప్రాంతాల పక్కనే వెలసిన మురికవాడల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యంగా టీనేజీ బాలికలు నెలసరి సమయంలో పడుతున్న ఇబ్బందులు మరింత దయనీయంగా ఉంటున్నాయి.

Written By Bhoomi
Published: Oct 26, 2026, 10:38 AM IST | Updated: Oct 26, 2026, 10:40 AM IST
Image Credit: Teenage Girls Period Problems
Join

Teenage Girls Period Problems: హైదరాబాద్ నగరంలో సంపన్న ప్రాంతాల పక్కనే వెలసిన మురికవాడల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యంగా టీనేజీ బాలికలు నెలసరి సమయంలో పడుతున్న ఇబ్బందులు మరింత దయనీయంగా ఉంటున్నాయి. ఆ సమయంలో శానిటరీ ప్యాడ్స్ మార్చుకునేందుకు కనీస ప్రైవసీ లేకపోవడం.. తాగునీరు, పారిశుద్ధ్య వసతులు కొరవడి బస్తీల్లోని ఆడపిల్లలు తీవ్ర మానసిక క్షోభను ఎదుర్కొంటున్నారు.

యూనివర్సిటీ ఆఫ్ టొరంటో.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పరిశోధకులు జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఫిల్మ్‌నగర్ బస్తీల్లో నిర్వహించిన అధ్యయనంలో దిగ్భ్రాంతికర విషయాలు ఎన్నో వెలుగుచూశాయి. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ టొరంటో డల్లా లానా స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకురాలు స్నిగ్ధ నేతృత్వంలో ప్రొఫెసర్ ఎరికా డి రుగ్గీరో, ప్రొఫెసర్ నందా కిశోర్ కన్నూరి, అనుష్క అతావుల్లాజాన్ ఈ పరిశోధన చేపట్టారు.

కేవలం శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేస్తే సమస్య పరిష్కారం కాదని.. ఇరుకైన నివాసాలు.. టాయిలెట్స్ లేకపోవడం.. నీటి సమస్య, సామానిక ఆంక్షలు వారిని తీవ్ర అభద్రతలోకి నెట్టేస్తున్నాయని గుర్తించారు. మురికివాడల్లోని పరిస్థితులకు తగ్గట్లుగా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుని.. పారిశుద్ధ్యం, నీటి వసతి కల్పించినప్పుడే ఆడపిల్లల ఆత్మగౌరవానికి నిజమైన రక్షణ లభిస్తుందని పరిశోధకులు అంటున్నారు.

జూబ్లీహిల్స్ ప్రాంతంలో దాదాపు 80 శాతం జనాభా మురికివాడల్లోనే జీవిస్తున్నారు. ముఖ్యంగా ఫిల్మ్‌నగర్-షేక్‌పేట్ పరిధిలోని ఎంజీనగర్, పటేల్‌నగర్‌లాంటి బస్తీల్లో పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. ఈ ప్రాంతంలో ఒక్కో కుటుంబం 10x10 అడుగుల విస్తీర్ణం ఉండే ఒకే ఒక్క గదిలో నివసిస్తున్నారు. రాత్రి వేళ పడకగదిగా, పగటిపూట వంటగదిగా మారే ఆ చిన్న గదిలో ఎలాంటి ఏకాంతం దొరకదు. ఇక ఒక్కో ఇంటి మధ్య సంది కేవలం 5, లేదా 6 అడుగుల వెడల్పు మాత్రం ఉన్నాయి. దీంతో నెలసరి సమయంలో బాలికలకు కనీస ప్రైవసీ లేకుండా పోయింది. ఇక వాడిన శానిటరీ ప్యాడ్స్ పారేసేందుకు ప్రత్యేకంగా డస్ట్ బిన్స్ లేకపోవడంతో వాటిని బహిరంగ చెత్త కుప్పల్లోనే వేయాల్సి వస్తోంది. దీంతో ఆ వ్యర్థాలను కుక్కలు, ఇతర జంతువులు పీక్కుతింటూ రోడ్లపైకి లాగుతున్నాయి. ఈ పరిస్థితులను చూసిన బాలికలు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు.  
 

ఇక బస్తీల్లోని కమ్యూనిటీ టాయిలెట్స్ కిలోమీటర్ల దూరంలో ఉండటంతో..వాటిని వాడేందుకు ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. ఇవి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. రాత్రి పది దాటిందంటే చాలు.. ఆడపిల్లలు, మహిళలు బహిరంగ మలవిసర్జనకే వెళ్లాల్సి వస్తోంది. తాగుబోతుల బెడద, అపరిశుభ్ర వాతావరణంతోపాటు టాయిలెట్లకు తలుపులు లేకపోవడం.. ఉన్నా గడియలు విరిగిపోయి ఉండటం.. వెలుతురు కోసం బల్బులు కూడా లేకపోవడం.. ఇలా తీవ్ర భయాందోళన మధ్య కాలం వెల్లదీయాల్సి వస్తోంది.  పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతూనే, మరోవైపు భద్రత కోసం కుటుంబ సభ్యులు కాపలా కాయాల్సిన పరిస్థితి ఉంటోంది. అంతేకాదు.. , బాలికలు మెచ్యూర్ అవ్వగానే.  బస్తీల్లోని ఆకతాయిల నుంచి అనుచిత చూపులు, లైంగిక వేధింపుల ముప్పు కూడా పెరుగుతోందని అధ్యయనం హెచ్చరించింది.

కేవలం ఉచితంగా శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేస్తేనే ఈ సమస్యకు పరిష్కాకం లభించదని పరిశోధకులు స్పష్టం చేశారు. ఇరుకైన ఇండ్లు, టాయిలెట్ల కొరత, తీవ్ర నీటి ఎద్దడి, సామాజిక ఆంక్షలు బాలికలను తీవ్ర అభద్రతాభావంలోకి నెడుతున్నాయని తెలిపారు. మురికివాడల్లోని క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు తగినట్లుగా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుని, పారిశుధ్యం, నిరంతర నీటి సరఫరా మరియు మౌలిక వసతులు కల్పించినప్పుడే ఆడపిల్లల ఆత్మగౌరవానికి నిజమైన రక్షణ లభిస్తుందని పరిశోధకులు తేల్చిచెప్పారు.

Also Read: 

ప్రిన్సిపాళ్ల సామూహిక తిరుగుబాటు.. మూకుమ్మడిగా సెలవులకు నిర్ణయం!

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES