• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /78 నెలల్లో 25 మందితో పెళ్లిళ్లు? యువతి అరెస్ట్.. అసలు మోసం ఇదే!

78 నెలల్లో 25 మందితో పెళ్లిళ్లు? యువతి అరెస్ట్.. అసలు మోసం ఇదే!

Marriage Fraud Case News: తాజాగా ఓ యువతి 78 నెలల్లోనే అనేక మందితో పెళ్లిన చేసుకున్న ఘటన సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే, ఈ ఘటనలో చాలా మంది యువకులు మోసపోయిన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 26, 2026, 11:23 AM IST|Updated: Oct 26, 2026, 11:25 AM IST
joinshare
78 నెలల్లో 25 మందితో పెళ్లిళ్లు? యువతి అరెస్ట్.. అసలు మోసం ఇదే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Ishan Kishan: మూడో టీ20 మ్యాచ్‌కు ఇషాన్ కిషన్ దూరం.. వైభవ్ సూర్యవంశీకి మరో బంపర్ ఛాన్స్..!

Ishan Kishan: మూడో టీ20 మ్యాచ్‌కు ఇషాన్ కిషన్ దూరం.. వైభవ్ సూర్యవంశీకి మరో బంపర్ ఛాన్స్..!

2

తెలంగాణలో వడ్లకు చరిత్రాత్మక ధర.. క్వింటాల్‌కు ఏకంగా రూ.5,000 దాటిన రేటు..!!

3

కళ్లద్దాలు పెడితే చూపు స్పష్టంగా వస్తుంది కదా.. మరి కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లేనా? అసలు నిజం ఇదీ!

4

78 నెలల్లో 25 మందితో పెళ్లిళ్లు? యువతి అరెస్ట్.. అసలు మోసం ఇదే!

5

Rahul Gandhi Accident: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తప్పిన ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Marriage Fraud Case News: పెళ్లిళ పేరుతో అమాయక యువకులను.. వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని నిలువునా దోచుకుంటున్న ఒక అంతర్రాష్ట్ర ముఠా రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.. 78 నెలల వ్యవధిలోనే అనేక రాష్ట్రాల్లో సుమారు 25 మంది పురుషులను వివాహం చేసుకుని.. ఆపై డబ్బులతో పాటు బంగారు ఆభరణాలతో ఉడాయించిన.. 23 ఏళ్ల యువతి అనురాధ పాశ్వాన్‌ను మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు..

పోలీసుల విచారణలో భాగంగా అందుబాటులోకి వచ్చిన వివరాల ప్రకారం.. అనురాధ ఒక మ్యాట్రిమోనియల్ ముఠాలో సభ్యురాలిగా గత కొన్ని రోజుల నుంచి పని చేస్తూ వస్తోంది.. వివాహం కోసం ఎదురుచూస్తున్న యువకులతో పాటు వారి కుటుంబాలను ఈ గ్యాంగ్ లక్ష్యంగా చేసుకుని చేయకూడని పనులు చేస్తూ వస్తోంది.. మధ్యవర్తులు సంబంధాలు కుదిర్చి.. వివాహం జరిపించినందుకు వరుడి కుటుంబాల నుంచి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు భారీ మొత్తంలో కమీషన్ రూపంలో వసూలు చేసేవారట..

పెళ్లి తంతు ముగిసిన తర్వాత నిందితురాలు అనురాధ సదరు భర్త వద్ద కేవలం 5 నుంచి 15 రోజుల పాటు మాత్రమే కాపురం చేసేదట.. ఆ తర్వాత ఇంట్లోని వారు నిద్రపోతున్న సమయంలో లేదా వారిని నమ్మించి ఇంట్లోని నగదుతో పాటు బంగారు నగలు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుంచి పారిపోయేదట..

రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌కు చెందిన విష్ణు శర్మ అనే బాధితుడు పెళ్లి పేరిట తాను దారుణంగా మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది.. కేసు నమోదు చేసుకున్న అధికారులు.. ప్రత్యేక దర్యాప్తు బృందంతో సాంకేతిక ఆధారాల సాయంతో నిందితురాలు భోపాల్‌లో ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. అక్కడ కూడా ఆమె గతంలో మోసగించిన మరో వ్యక్తితో కలిసి నివసిస్తున్నట్లు తెలుస్తోంది..

అయితే, ఆ నిందితురాలిని పక్కాగా పట్టుకునేందుకు.. రాజస్థాన్ పోలీసులు ప్రత్యేక వ్యూహం రచించిన్నట్లు తెలుస్తోంది.. ఒక పోలీసు అధికారిని నకిలీ వరుడిగా రంగంలోకి దించి.. మధ్యవర్తుల ద్వారా అనురాధతో సంబంధం కుదిర్చేందుకు ప్రయత్నించారట.. ఈ ఉచ్చులో పడిన అనురాధను భోపాల్‌లో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది..

ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? మధ్యవర్తులుగా వ్యవహరించిన వ్యక్తుల నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించింది? అనే అంశాలపై పోలీసులు లోతుగా విచారణ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.. వివాహ సంబంధాలు కుదుర్చుకునే సమయంలో మధ్యవర్తులను గుడ్డిగా నమ్మకుండా.. పూర్తి వివరాలను తెలుసుకోవడం చాలా మంచిదని పోలీసు అధికారులు తెలుపుతున్నారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అవుతోంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Viral News
Trending News