తెలంగాణలో పెరిగిన చలి.. కోహిర్‌లో అత్యల్పంగా 11.7 డిగ్రీల ఉష్ణోగ్రత..
Telangana Cold Waves: తెలంగాణ వాసులను చలి చంపేస్తోంది. గత కొన్ని వారం పది రోజుల నుంచి చలి తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో ప్రజలు ఉదయాన్నే వెచ్చని చలి మంటలు కాచుకుంటుకున్నారు. అంతేకాదు ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో కనిష్ఠానికి పడిపోయాయి. రాబోయే రోజుల్లో సింగిల్ డిజిట్‌కు పరిమితం కానున్నాయి.
Telangana Weather Update: తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత అంతకంతకు పెరుగుతూ పోతుంది. మరో రెండు మూడు రోజుల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య భారతాల నుంచి వీస్తున్న పొడి గాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అతి తక్కువగా నమోదవుతున్నాయి. ఇదే పరిస్థితి జనవరి 18 వరకు ఉండే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది.
కోహిర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత..
ఇక తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 11.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మొయినాబాద్‌లో 11.8, గాంధారిలో 12.2 డిగ్రీలు, నేరడిగొండలో 13. గండీడ్‌లో 13.1 డిగ్రీలు, సిర్పూర్ ( యు )లో 13.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యయి. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో 13.4 డిగ్రీలుగా నమోదైంది.జీహెచ్ఎంసీ, ఎంఎన్‌సీ, సీఎంసీలోని పలు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
భారీగా పొగమంచు..
ఉమ్మడి ఆదిలాబాద్ లో చలి తీవ్రగా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ చలి ప్రభావం అధికంగా ఉంది. పొడి వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగనుండగా, ఉదయం వేళల్లో పొగమంచు కమ్మేస్తుండటంతో ప్రయాణాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. కార్లలో వెళ్లే వాళ్లు లైట్లను డిప్ చేస్తూ వెళ్లాలని సూచిస్తున్నారు. చలి తీవ్రత దృష్ట్యా పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్వెటర్లు, మఫ్లర్లు ఉపయోగించాలని కోరుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాతావరణ మార్పుల వల్ల ఈ నెల 20 తర్వాత రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.