SSC Board Exam Schedule: తెలంగాణలో పదో తరగతి పరీక్షల వార్షిక షెడ్యూల్‌ను ఎస్ఎస్‌సీ బోర్డ్ వెల్లడించింది. షెడ్యూల్‌ను అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదంతో త్వరలో అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. ప్రధాన పరీక్షలు ఏప్రిల్ 10వ తేదీతో ముగుస్తాయి.
ఆరు సబ్జెక్టులు.. ఏడు పేపర్లు..
ప్రధాన పరీక్షల ప్రారంభం నుంచి ముగింపు వరకు 24 రోజుల సమయం ఉంది. పదో తరగతిలో ఆరు సబ్జెక్టులకు ఏడు పేపర్లు ఉండటంతో ఏడు రోజులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సీబీఎస్‌ఈ తరహాలో పరీక్షల మధ్య వ్యవధిని గతేడాది పెంచారు. ఆ విధానాన్ని ఈ సారీ కొనసాగిస్తున్నారు.
పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఫైన్ లేకుండా ఈ నెల 26 వరకూ గడువు
పదో తరగతి పరీక్షలకు దాదాపు 5.25 లక్షల నుంచి 5.50 లక్షల మంది హాజరుకానున్నారు. ఆలస్య రుసుం లేకుండా పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఈ నెల 26 వరకు గడువు ఉంది. అప్పటి ఫీజు చెల్లించవారికి అపరాధ రుసుముతో మరో వారం రోజులు గడువు ఇవ్వనున్నట్టు అధికారులు చెప్పుకొచ్చారు. మొత్తంగా అర్ధ వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలోనే పదో తరగతి షెడ్యూల్ చేశారు. మరోవైపు పదో తరగతికి సంబంధించిన మరిన్ని కొత్త విధి విధానాలను త్వరలో ఖరారు చేయబోతున్నట్టు అధికారులు తెలిపారు.