Vijaya reddy Petition: ఖైరతాబాద్ ఉపఎన్నికపై విజయారెడ్డి పిటిషన్.. తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం.!.
Telangana high court: విజయారెడ్డి తరపున లాయర్ కోర్టులో వాదనలు వినిపిస్తూ, 2024 ఎన్నికల్లో దానం నాగేందర్ విజయాన్ని సవాల్ చేశారు. దీనిలో తమ క్లయింట్ దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపారు.
Telangana high court adjourned Vijaya reddy petition: తెలంగాణలో ప్రస్తుతం ఖైరతాబాద్ ఉపఎన్నికలపై రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికల సంఘం ఎప్పుడైన దీనిపై నోటిఫికేషన్ ను ఇవ్వవచ్చు. ఈ క్రమంలో అన్నిపార్టీలు ఎలాగైన ఖైరతాబాద్ లో పాగా వేయాలని పావులు కదుపుతున్నాయి. తమ పార్టీనే విజయం సాధిస్తుందని అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. దివంగత మాజీ మంత్రి పి. జనార్దన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డి ఖైరతాబాద బై పోల్ ఎన్నిక నోటిఫికేషన్ పై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
విజయారెడ్డి తరఫు లాయర్ కోర్టులో వాదనలు వినిపిస్తూ, 2024 ఎన్నికల్లో దానం నాగేందర్ గెలుపును సవాల్ చేస్తూ తమ క్లయింట్ దాఖలు చేసిన పిటిషన్ ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉందని వాదించారరు. ఆ ఎన్నికల అఫిడవిట్‌లో దానం నాగేందర్ తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు.
ఈ పాత పిటిషన్‌పై తుది తీర్పు వచ్చేవరకు ఖైరతాబాద్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయకుండా నిలిపివేయాలని కోర్టును అభ్యర్థించారు. అయితే.. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను మంగళ వారంకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో కోర్టు నిర్ణయంతో తదుపరి ఆదేశాలు ఏవిధంగా ఉంటాయోనన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.