SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 10 నుంచి దసరా సెలవులు.. ఎప్పటి వరకు అంటే?

Telangana Junior College Holidays: తెలంగాణ ఇంటర్‌ విద్యార్ధులను రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన శుభవార్తను అందించింది. అక్టోబర్‌ 10వ తేది ఇంటర్‌ విద్యార్థులకు సెలవులను ప్రకటించినట్లు అధికారిక సమాచారం. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 03, 2026, 11:48 AM IST | Updated: Oct 03, 2026, 11:50 AM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Telangana Junior College Holidays: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్‌ కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగా సెలవును ప్రకటించిన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి వార్షిక అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం.. అక్టోబర్‌ 10వ తేది నుంచి విద్యార్థులకు దసరా సెలవులు ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, మళ్లీ అక్టోబర్‌ 21వ తేది వరకు కొనసాగుతాయని అధికారులు వెల్లడించిన్నట్లు తెలుస్తోంది. సెలవుల అనంతరం అక్టోబర్ 22న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జూనియర్ కళాశాలలు యథావిధిగా ప్రారంభం కాబోతున్నాయి.

ఈ సెలవులు కేవలం ప్రభుత్వ కళాశాలలకే పరిమితం కాకుండా.. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్‌ఎయిడెడ్, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమతో పాటు గిరిజన సంక్షేమ, మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (KGBV) పరిధిలోని జూనియర్ కళాశాలలన్నింటికీ వర్తిస్తాయని సమాచారం. మొత్తం 12 రోజుల పాటు విద్యార్థులకు బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా విద్యా సంస్థల నుంచి విరామం లభించబోతున్నట్లు తెలుస్తోంది.

సెలవుల కాలంలో విద్యార్థులపై ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా... పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. అయితే, కొన్ని ప్రైవేటుతో పాటు కార్పొరేట్ యాజమాన్యాలు సెలవు దినాల్లో కూడా స్పెషల్ క్లాసులు, పరీక్షలు నిర్వహిస్తుంటాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఇంటర్ బోర్డు కఠిన మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..

నిబంధనలు ఉల్లంఘించి తరగతులు నడిపే విద్యాసంస్థలపై సంబంధిత జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు (DIEOs) ఆకస్మిక తనిఖీలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని... ఆదేశాలను పాటించని.. కాలేజీలపై గుర్తింపు రద్దుతో సహా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ త్వరలోనే స్పష్టం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పండుగ సెలవులు ముగిసిన వెంటనే విద్యార్థులు అక్టోబర్ 22న కళాశాలలకు హాజరు కావాలని.. ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు సైతం అదే రోజున విధులకు హాజరై తరగతులను ప్రారంభించాలని అధికారు సూచించిన్నట్లు తెలుస్తోంది..

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES