Ananthagiri Hills Bus Accident: వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రయాణం చేసేటప్పుడు ప్రాణాలతో ఇంటికి చేరుకుంటామా అనే ఆందోళన నెలకొంది. కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలోకి వెళ్లడం వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పటాన్ చెరు నుంచి వికారాబాద్‌లోని చింతకుంటకు బంధువుల అంత్యక్రియల కోసం 54 మందితో వెళ్తున్న ఈ బస్సు ప్రమాదానికి గురైంది. క్షతగాత్రులను కాపాడేందుకు స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని సాక్షులు చెబుతున్నారు.
స్పీకర్ గడ్డం తీవ్ర విచారణ..
వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, వారు ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై విదేశీ పర్యటనలో ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం, పలువురు గాయపడటం ఆయన దృష్టికి వచ్చిన వెంటనే, సంబంధిత అధికారులను అలర్ట్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే, ఆ తర్వాత మృతుల సంఖ్య పెరుగుతోంది. 5 గురికి చేరింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ప్రభుత్వంగా వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. వికారాబాద్ ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ వెంటనే స్పందించి, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి, వారికి అత్యుత్తమ వైద్యం అందేలా చూడాలని సూచించారు.
Vikarabad, Telangana | Three passengers died and several passengers were injured after a private bus overturned near Anathagiri hills in Vikarabad district, today
According to a police official, "Three people died and several were injured after a private bus overturned. The…— ANI (@ANI) October 3, 2026
మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పీకర్ గడ్డం ప్రసాద్ భరోసా ఇచ్చారు. బస్సు ప్రమాదంలో ముగ్గురు మరణించడం అత్యంత విచారకరం అని, విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ ఆయన వెంటనే అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో ఈ దుర్ఘటన జరిగింది.
వికారాబాద్ జిల్లా అనంతగిరిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
ఘాట్ రోడ్డులో అదుపుతప్పి బస్సు బోల్తా
పలువురికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
యాచారం నుంచి బానూరుకు వెళ్తుండగా ప్రమాదం
ఘటనాస్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు#Vikarabad #AnanthagiriHills #TelanganaNews pic.twitter.com/sT6E0FTWvT— citizenspulse (@citizenspulse01) October 3, 2026
సీఎం దిగ్భ్రాంతి..
అనంతగిరి ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి అధికారులను ఆదేశించారు. అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేటు బస్సు అదుపుతప్పడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుసుకున్న సీఎం, సంబంధిత అధికారులతో వివరాలు అడిగి పరిస్థితిని సమీక్షించారు.
5 కు చేరిన మృతుల సంఖ్య..
అనంతగిరి 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో సుమారు 20 మందికి తీవ్ర గాయాలు కాగా, ఇప్పటివరకు మృతుల సంఖ్య 5 కు చేరింది. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వికారాబాద్, తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల ఆనవాళ్లు గుర్తించడం కూడా కష్టంగా మారినట్లు సమాచారం.