• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /కళ్లజోళ్ల బాబా వైరల్ వీడియో.. తలపై చేయి పెడితే చూపు వస్తుంది?

కళ్లజోళ్ల బాబా వైరల్ వీడియో.. తలపై చేయి పెడితే చూపు వస్తుంది?

Glasses-Breaking Baba Viral Video: తాజాగా కళ్లజోళ్ల బాబాకు సంబంధించిన వీడియో వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన డాక్లర్లు షాక్‌ అవుతున్నారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 03, 2026, 12:27 PM IST|Updated: Oct 03, 2026, 12:30 PM IST
joinshare
కళ్లజోళ్ల బాబా వైరల్ వీడియో.. తలపై చేయి పెడితే చూపు వస్తుంది?
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Virat Kohli 100 Centuries: "కోహ్లీ 100 సెంచరీలు కొట్టలేడు, 98కే పరిమితం" సచిన్ రికార్డుపై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు!

Virat Kohli 100 Centuries: "కోహ్లీ 100 సెంచరీలు కొట్టలేడు, 98కే పరిమితం" సచిన్ రికార్డుపై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు!

2

అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య,! సీఎం, స్పీకర్‌ తీవ్ర సంతాపం!

3

కళ్లజోళ్ల బాబా వైరల్ వీడియో.. తలపై చేయి పెడితే చూపు వస్తుంది?

4

ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 10 నుంచి దసరా సెలవులు.. ఎప్పటి వరకు అంటే?

5

తమిళనాడులో సైన్‌బోర్డుపై హిందీ పదాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Glasses-Breaking Baba Viral Video: ఆధునిక వైద్యరంగం రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్న సమయంలో కూడా అంధవిశ్వాసాలతో పాటు వింత చికిత్సల పట్ల ప్రజల ఆకర్షణ ఏమాత్రం తగ్గడం లేకుండా పోతోంది.. తాజాగా పంజాబ్‌లోని పటియాలా జిల్లా సాలెంపూర్‌ బ్రాహ్మణ గ్రామంలో వెలుగుచూసిన ఓ ఉదంతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తలపై చేయి పెడితే చాలు.. ఎలాంటి కంటి సమస్య అయినా మాయమైపోతుందని ప్రచారం చేసుకుంటున్న ఓ వ్యక్తి ప్రస్తుతుం కళ్లద్దాలు పగలగొట్టే బాబా బాబా సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సాధారణంగా దొంగ బాబాలు చేసే తంత్రాలు.. మంత్రోచ్ఛారణలు వంటివి ఇక్కడ ఏమీ ఉండవట... బాబా తన వద్దకు వచ్చే.. బాధితుల తలపై కేవలం తన చేతిని మాత్రమే పెడతాడట.. ఆ స్పర్శ వల్ల క్షణాల్లో కంటిచూపు సమస్య తొలగిపోతాయని అక్కడికి వచ్చిన వారిని నమ్మిస్తాడు.. చికిత్స పూర్తయిందంటూ బాధితులు ధరించిన కళ్లద్దాలను తీయించి.. ఇక మీకు వీటితో అవసరం లేదు.. విసిరేయండి అంటూ పారేయిస్తున్నాడు. ఇప్పుడు ఈ దృశ్యాలే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఈ విషయం వేగంగా వైరల్ అవ్వడంతో.. పంజాబ్‌తో పాటు సమీప ప్రాంతాల నుంచి కంటి సమస్యలు, సైట్ ఉన్న వేలాది మంది ప్రజలు ఆయన వద్దకు క్యూ కడుతున్నట్లు సమాచారం. ఇక్కడి చిన్న పిల్లల నుంచి పండు వృద్ధుల వరకు గంటల తరబడి.. అక్కడున్న వరుసల్లో నిలబడి బాబా స్పర్శ కోసం ఎదురుచూస్తూ వస్తున్నారట.. ఏళ్ల తరబడి అద్దాలు వాడుతున్న వారు సైతం ఆశతో ఇక్కడికి వస్తుండటం ఆశ్చర్యం కలుగుతోంది..  

అయితే, ఈ వ్యవహారం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో.. వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మానవ కంటి నిర్మాణం, దృష్టి లోపాలు, కార్నియా, కంటి లెన్స్ ఆకృతిపై ఆధారపడి ఉంటాయని.. స్పర్శ ద్వారా లేదా మహిమలతో దృష్టి రాదని.. శాస్త్రీయంగా అసాధ్యమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైన ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియో మాత్రం వైరల్ అవుతోంది.
 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by TeluguPost (@telugupostnews)

Add Zee News as a Preferred Source
TAGS:
Viral News
Trending News