• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Inter Exam Schedule: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే!

Inter Exam Schedule: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే!

Telangana Intermediate Exam 2027 Schedule Released Here Full Details Including Practicals: తెలంగాణ విద్యార్థులకు బిగ్‌ అర్ట్‌. విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్మీడియట్‌కు సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది. మొదటి, రెండో సంవత్సరానికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేసింది. పరీక్షలు షెడ్యూల్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 19, 2026, 16:12 IST|Updated: Nov 19, 2026, 17:32 IST
joinshare
Inter Exam Schedule: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే!
Image Credit: Telangana Inter Exams 2027 Schedule Release

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Inter Exams 2027 Schedule: విద్యార్థి దశలో అత్యంత కీలకమైన ఇంటర్మీడియట్‌కు సంబంధించి కీలక ప్రకటన వచ్చేసింది. విద్యార్థులు ఏడాది పాటు కష్టపడి రాసే బోర్డు పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ విడుదలైంది. ఇంటర్‌మీడియట్‌ మొదటి, రెండో సంవత్సరానికి సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్‌ బోర్డు విడుదల చేసింది. ప్రాక్టీకల్స్‌తోపాటు పరీక్షల తేదీలను వెల్లడించింది. వచ్చే సంవత్సరం ఇంటర్‌ విద్య విలీనం కానుండడంతో ఇదే చివరి బోర్డు పరీక్షలు కానున్నాయి. పరీక్షలకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ ఇలా ఉంది.

తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2027లో ఫిబ్రవరి, మార్చిలో జరగనున్నాయి. పరీక్షలకు ముందే ప్రాక్టికల్స్, ఇంటర్నల్ అసెస్‌మెంట్, ఇతర పరీక్షలను పూర్తి చేయనున్నట్లు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలిపింది. 2027లో ఫిబ్రవరి, మార్చిలో పరీక్షలు జరుగుతాయని ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించింది. పరీక్షలకు ముందే ప్రాక్టికల్స్, ఇంటర్నల్ అసెస్‌మెంట్ తదితర వాటిని పూర్తి చేయనున్నట్లు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలిపింది. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు మార్చి 20వ తేదీ వరకు జరగనుండగా.. సమయం వచ్చేసరికి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండనున్నాయి.

ప్రాక్టికల్స్, అసెస్‌మెంట్ షెడ్యూల్
జనవరి 20 నుంచి 25 వరకు ఫస్ట్ ఇయర్ ఇంటర్నల్ అసెస్‌మెంట్ పరీక్షలు
జనవరి 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష
జనవరి 29న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష
జనవరి 29న ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్
జనవరి 30న సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్

సెకండ్ ఇయర్ సైన్స్ ప్రాక్టికల్స్
ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు ఆదివారాలతో కలిపి ప్రతిరోజూ రెండు సెషన్లలో సెకండ్ ఇయర్ సైన్స్ ప్రాక్టికల్ పరీక్షలు 
మొదటి సెషన్‌: ఉదయం సెషన్ 9 నుంచి 12 వరకు
రెండో సెషన్‌: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు

ఫస్ట్ ఇయర్ సైన్స్ ప్రాక్టికల్స్‌
ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు ఆదివారం కూడా కలిపి మొత్తం రోజుకు మూడు సెషన్లు
సెషన్-1 ఉదయం 9 నుంచి 11 వరకు
సెషన్-2 మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు
సెషన్-3 మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5.30 వరకు

ఫస్ట్ ఇయర్ పరీక్షలు
ఫిబ్రవరి 24న సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
ఫిబ్రవరి 26న ఇంగ్లీష్ పేపర్-1
మార్చి 2న మ్యాథమెటిక్స్ పేపర్-1ఏ, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1, అకౌంటెన్సీ పేపర్-1 (ఏసీఈ గ్రూప్)
మార్చి 5న మ్యాథమెటిక్స్ పేపర్-1బీ, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1, కామర్స్ పేపర్-1 (ఏసీఈ గ్రూప్)
మార్చి 9న ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1
మార్చి 15న కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్-1
మార్చి 17న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, ఎంఈసీ గ్రూప్‌కు మ్యాథమెటిక్స్ పేపర్-1 (సింగిల్ పేపర్)
మార్చి 19న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1, బైపీసీ విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-1

సెకండ్ ఇయర్ పరీక్షలు
ఫిబ్రవరి 25న సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
ఫిబ్రవరి 27న ఇంగ్లీష్ పేపర్-2
మార్చి 3న మ్యాథమెటిక్స్ పేపర్-2ఏ, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2
మార్చి 8న మ్యాథమెటిక్స్ పేపర్-2బీ, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2
మార్చి 12న ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2, మార్చి 16న కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్-2
మార్చి 18న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2
మార్చి 20న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2, బైపీసీ విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-2

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Exams
Telangana News
Trending News