• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /మందు బాబులకు షాక్.. రేపటి నుంచి తెలంగాణలో లిక్కర్ షాప్స్ బంద్..?

మందు బాబులకు షాక్.. రేపటి నుంచి తెలంగాణలో లిక్కర్ షాప్స్ బంద్..?

Telangana Liquor Shops Closed: తెలంగాణలో రేపటి నుంచి బార్‌ల వ్యాపారులు ఆందోళన బాట పట్టనున్నారు. బార్ల లైసెన్స్ నిబంధనలు, ఫీజుల పెంపు విషయంలో ప్రభుత్వ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర బార్ అండ్‌ రెస్టారెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 04, 2026, 12:41 PM IST|Updated: Oct 04, 2026, 12:43 PM IST
joinshare
మందు బాబులకు షాక్.. రేపటి నుంచి తెలంగాణలో లిక్కర్ షాప్స్ బంద్..?
Image Credit: Telangana Liquor shops Closed (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Mahabubabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్ కు చెందిన మహిళ మృతి.!.

Mahabubabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్ కు చెందిన మహిళ మృతి.!.

2

2027 Long Weekends: 2027లో ఉద్యోగులకు తీవ్ర నిరాశ..ప్రధాన పండుగలన్నీ వారాంతపు సెలవుల్లోనే!

3

స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం ఆశలు..

4

బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాల చోరీలో కీలక మలుపు..

5

మందు బాబులకు షాక్.. రేపటి నుంచి తెలంగాణలో లిక్కర్ షాప్స్ బంద్..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Bars Closed: తెలంగాణలో లిక్కర్ షాపులు నిర్వహించే వారికి ప్రభుత్వం  భారీగా ఫీజులు మోపడంతో బార్ లైసెన్స్ పొందిన వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బార్ లైసెన్స్.. ఇతరత్రా ప్రభుత్వ విభాగాలు, మున్సిపల్, పోలీసులు, ఎక్సైజ్ వాళ్లకు చేతులు తడపందే తమ పని  కావడం లేదంటున్నారు. పైగా బార్ లైసెన్స్ పొందాలంటే ఎన్నో అగచాట్లు పడి ఎన్నో లక్షలు నీళ్లలా ఖర్చు పెడితే కానీ బార్ లెసెన్స్ లు మంజూరు కావడం లేదు.

బార్ లైసెన్స్ మంజూరైనా.. ఆయా బార్లు ఉన్న రోడ్ల పై టాక్స్ పేయర్స్ (మందుబాబులు ) ఎక్కడ పడితే అక్కడ తమ బండ్లను పార్క్ చేస్తున్నారు. ఇవి ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి.  సామాన్య ప్రజలు వీటి వల్ల తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. అయితే బారు యజమానులు నెలకు ఇంత అని మున్సిపల్ అధికారులకు ముడుపులు ఇవ్వడం మూలానే వాళ్లు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. మరోవైపు పోలీసుల మాముళ్లు సరేసరి. మరోవైపు ఎక్సైజ్ సహా కొన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన వాళ్లు.. బారు యజమానులను పట్టి పీడిస్తున్నారు. అయితే ఇందులో ఎక్కువ రాజకీయ నాయకులు ఉండటంతో కొన్ని బార్ల జోలికి ఆయా ప్రభుత్వ విభాగాల అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.

ఇవన్నీ కాదంటూ బార్ లైనసెన్స్  ఫీజులు పెంచడం వలన తాము వ్యాపారాన్ని నడపలేమంటున్నారు. ఈ నేపథ్యంలో  సోమవారం నుంచి బార్లను మూసేస్తామని హెచ్చరించింది. గతంలో రూ. 40 లక్షలుగా ఉన్న లైసెన్స్ ఫీజును ప్రస్తుతం రూ. 44 లక్షలకు పెంచి భారం మోపుతున్నారని మండిపడింది. ప్రివిలేజ్ సెస్‌ను స్లాబ్ పద్ధతిలో 8 శాతం  నుంచి 20 శాతానికి పెంచారంటోంది.  దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది.లేకపోతే నిరవధిక సమ్మె చేపడతామంటోంది. కానీ బార్ యజమానులు రోజు వచ్చే ఆదాయాన్ని ఒదులుకొని ఈ ధర్నాకు దిగుతారా లేదా అనేది చూడాలి. 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News
Hyderabad