• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం ఆశలు..

స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం ఆశలు..

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించి బలమైన వాదనలు వినిపించింది. రాష్ట్రంలో సమకాలీన, శాస్త్రీయ డేటాను ప్రాతిపదికగా తీసుకునే పట్టణ స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు 33.33 శాతం రిజర్వేషన్లను ఖరారు చేశామని ఏపీ సర్కార్ న్యాయస్థానానికి నివేదించింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 04, 2026, 12:52 PM IST|Updated: Oct 04, 2026, 12:55 PM IST
joinshare
స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం ఆశలు..
Image Credit: AP Local Body Elections (File/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Fuel Vs EV Insurance: పెట్రోల్ కార్లు Vs ఎలక్ట్రిక్ కార్లు..కొత్త కారు ఇన్సూరెన్స్‌లో తెలుసుకోవాల్సిన కీలక సూత్రాలు!

Fuel Vs EV Insurance: పెట్రోల్ కార్లు Vs ఎలక్ట్రిక్ కార్లు..కొత్త కారు ఇన్సూరెన్స్‌లో తెలుసుకోవాల్సిన కీలక సూత్రాలు!

2

Mahabubabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్ కు చెందిన మహిళ మృతి.!.

3

2027 Long Weekends: 2027లో ఉద్యోగులకు తీవ్ర నిరాశ..ప్రధాన పండుగలన్నీ వారాంతపు సెలవుల్లోనే!

4

స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం ఆశలు..

5

బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాల చోరీలో కీలక మలుపు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP Govt hopes on Supreme court Verdict: ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి రాష్ట్రంలో అమలవుతున్న మొత్తం రిజర్వేషన్ల పరిమితి కేవలం 49.24 శాతం మాత్రమే ఉందని, ఇది సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం గరిష్ట పరిమితిని ఏమాత్రం దాటలేదని స్పష్టం చేసింది. తాజా సమగ్ర సర్వే నివేదికల ప్రకారం రాష్ట్రంలో బీసీల జనాభా ఏకంగా 50.42 శాతంగా తేలిందన్నారు.  జనాభా దామాషాకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని కోర్టుకు వివరించింది.

ప్రభుత్వం సమర్పించిన ఈ తాజా అధికారిక డేటాను, వాస్తవ గణాంకాలను హైకోర్టు సమగ్రంగా పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయం వెలువరించిందని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. స్థానిక పాలనలో వెనుకబడిన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని, నిబంధనలకు లోబడే కేటాయింపులు జరిగాయని ప్రభుత్వం వాదించింది. అందువల్ల ఈ వ్యవహారంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తక్షణమే స్టే విధించి, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా న్యాయం చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీసుకోబోయే నిర్ణయం రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపై కీలకంగా మారనుంది.

స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాపై వచ్చే వారంలో సుప్రీంకోర్టు నిర్ణయం రావొచ్చని సీఎం చంద్రబాబు టీడీపీ నేతలతో జరిగిన జూమ్ కాన్ఫరెన్స్‌లో అన్నారు. ఆ వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలకు వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. బీసీలకు 34శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అంగీకరించకపోతే పార్టీపరంగా ఇస్తామని తెలిపారు. తొలి దశలో మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయన్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
AP News
Andhra Pradesh
Chandrababu Naidu
Pawan Kalyan