SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Thummala Nageswara Rao: తప్పుడు ప్రచారం నమ్మవద్దు.. క్రాప్‌ హలీడేపై తెలంగాణ మంత్రి కీలక ప్రకటన!

Thummala Nageswara Rao Key Statement On Crop Holiday: ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో పంటలు వేసుకోవద్దని మంత్రులు ప్రకటించగా.. దానికి విరుద్ధంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. తాము ఎలాంటి క్రాప్‌ హలీడే ప్రకటించలేదని స్పష్టత ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 31, 2026, 11:26 PM IST | Updated: Oct 31, 2026, 11:32 PM IST
Image Credit: Source: Thummala Nageshwar Rao Facebook
Join

Telangana Crop Holiday: తాము ఎలాంటి క్రాప్ హాలిడే ప్రకటించలేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతులు ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఎల్‌నినో ఒక ప్రపంచ విపత్తు.. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి, సమీకృత పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు వివరణ ఇచ్చారు. రైతులకు ఆరు నెలల నుంచి ఎల్‌నినోపై తాము అవగాహన కల్పిస్తున్నామని.. ప్రతి వారం రైతులకు వాతావరణ పరిస్థితులు, భూగర్భ జలాల మట్టాల వివరాలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. రాయితీపై ప్రత్యామ్నాయ పంటల విత్తనాల పంపిణీ చేస్తున్నామని.. రైతులను నష్టాల నుంచి కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి తుమ్మల ప్రకటన చేశారు.

ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని.. రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రతిపక్షాలు మానుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  సూచించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై ముందస్తు ప్రణాళికతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం, నీటి లభ్యతలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండడంతో రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఆరుతడి, సమీకృత పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని మంత్రి తుమ్మల వివరించారు.

ఎల్‌నినో పరిస్థితులు ఒక్క తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాలేదని.. కరువు మండలాల పంట నష్టంపై అధికారులకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. రైతులకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడూ వాతావరణ అనుకూల సందేశాలు రైతులకు చేరవేస్తున్నారని చెప్పారు. వాతావరణ మార్పులు, వర్షపాతం అంచనాలు, భూగర్భ జలాల లభ్యతను పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ శాఖ ముందస్తు కార్యాచరణ రూపొందించిందని వెల్లడించారు. నీటి కొరత కారణంగా రైతులు నష్టపోయే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వివరించారు.

రైతు వేదికలను కేంద్రంగా చేసుకుని వ్యవసాయ శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా పంటల ఎంపిక, విత్తనాల లభ్యత, నీటి వినియోగం, ప్రత్యామ్నాయ సాగు విధానాలపై రైతులకు సూచనలు అందిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. ఆరుతడి పంటల విత్తనాలను రాయితీపై రైతులకు అందిస్తున్నామని.. పంటల సాగుపై నిపుణులతో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలు సాగు చేయాలనే దానిపై మార్గనిర్దేశం చేస్తున్నామని తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ, తక్కువ నీటితో సాగయ్యే పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర లభిస్తున్న పరిస్థితులు ఉన్నాయని.. రాష్ట్రంలో 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. పంటల సాగు నుంచి దిగుబడుల విక్రయం వరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు.

వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు. రైతులకు ధైర్యం చెప్పాల్సిన సమయంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ.. మరింత ఆందోళనకు గురిచేయడం సరికాదని చెప్పారు. ప్రభుత్వం ఎక్కడా క్రాప్ హాలిడే ప్రకటించలేదని స్పష్టత ఇచ్చారు. రైతులు తమ ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలన్నదే ప్రభుత్వ సూచన తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES