SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Dussehra Holidays: ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు బిగ్ షాక్.. దసరా పండగ వేళ భారీగా చార్జీల పెంపు.!.

Rtc special busses charges hike: దసరా పండగకు సొంతూర్లకు వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా ఏడు వేల బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో దీనిలో అదనంగా 50 శాతం చార్జీలు వసులు చేస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించారు.

Written By Inamdar Paresh
Published: Oct 08, 2026, 10:57 AM IST | Updated: Oct 08, 2026, 11:05 AM IST
Image Credit: tgsrtcdasaracrowd(file)
Join

Tgsrtc hikes bus fares amid dasara festival: తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసిన బతుకమ్మ, దసరా పండగ శోభ కన్పిస్తుంది. ఈ నేపథ్యంలో దసరాను తెలంగాణలో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని  ఘట స్థాపన చేసి పూజించుకుంటారు. అంతే కాకుండా బతుకమ్మ నేపథ్యంలో మహిళలు పూలతో అందంగా బతుకమ్మలను పేరుస్తారు. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. 

మరోవైపు వివిధ ప్రాంతాల్లో జాబ్ లు, ఇతర పనులలో ఉన్న వారు సైతం తమసొంతూర్ల బాటపట్టారు. ఈ క్రమంలో  తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు రద్దీ వేళ ఇప్పటికే 7 వేల స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది. అయితే వీటిలో.. 50% అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నట్టు ముందుగానే ప్రకటించింది.

ఒక్క కరీంనగర్‌ జోన్‌ నుంచే మొత్తం 3,533 బస్సులు నడుపుతున్నట్టు తెలిపింది. రీజియన్లవారీగా చూస్తే..  గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ నుంచి 1,312, ఆదిలాబాద్‌ నుంచి 431,  కరీంనగర్‌ నుంచి 1,175, రంగారెడ్డి నుంచి 440, వరంగల్‌ నుంచి 530, ఖమ్మం నుంచి 678 బస్సులు ఉన్నాయి.

 హైదరాబాద్‌ జోన్‌ నుంచి 2,155 బస్సులు నడుపుతుండగా.. మహబూబ్‌నగర్‌ నుంచి 645, మెదక్‌ నుంచి 255, నిజామాబాద్‌ నుంచి 719, నల్లగొండ నుంచి 815  బస్సులు ప్రత్యేక సర్వీసులుగా నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ముఖ్యంగా ఈ నెల 9,10,16,17 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎకువగా ఉండే అవకాశం ఉన్నదని.. ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. 

మరోవైపు పండగ తర్వాత 25, 26 తేదీల్లో తిరుగు ప్రయాణ రద్దీకి తగిన ఏర్పాట్లు చేయనున్నారు. ఇక పండగ వేళ  ఆర్టీసీ చార్జీలను పెంచడంతో బస్సు ప్రయాణికులు లబో దిబో మంటున్నారు. పండగ పూట ఈ చార్జీల వాతలు  ఏంటని మండి పడుతున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES