• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /తెలంగాణలో 50 డిగ్రీలకు చేరనున్న ఎండలు? రైతులకు మంత్రి తుమ్మల కీలక హెచ్చరిక!

తెలంగాణలో 50 డిగ్రీలకు చేరనున్న ఎండలు? రైతులకు మంత్రి తుమ్మల కీలక హెచ్చరిక!

Telangana Summer Alert: ఈ వేసవికాలంలో ఎండలు దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశాలున్నట్లు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్తో రైతాంగం వరి సాగు కాకుండా ప్రత్యామ్నాయ పంటలను పండించాలని పిలుపునిచ్చారు. వరి వేయడం వల్ల రైతాంగం తెలియపరంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు..

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 19, 2026, 02:15 PM IST|Updated: Oct 19, 2026, 02:16 PM IST
joinshare
తెలంగాణలో 50 డిగ్రీలకు చేరనున్న ఎండలు? రైతులకు మంత్రి తుమ్మల కీలక హెచ్చరిక!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
DJ Sound Death: సద్దుల బతుకమ్మ వేడుకల్లో డీజే సౌండ్‌కు కుప్పకూలిన మహిళ.. పండుగ ఆనందం ఆవిరి

DJ Sound Death: సద్దుల బతుకమ్మ వేడుకల్లో డీజే సౌండ్‌కు కుప్పకూలిన మహిళ.. పండుగ ఆనందం ఆవిరి

2

దీపావళికి ముందే రైతుల ఖాతాల్లోకి రూ.2,000? 24వ విడత సొమ్ము వచ్చేది వారికే!

3

CM Chandrababu naidu: భరించలేని తనమా..?.. ఉన్మాదమా..?.. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

4

ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఆలుగ‌డ్డ‌ల‌ను అస్స‌లు తిన‌కూడదు..!

5

‘జైలర్ 2’ సహా 2026లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలు ఇవే..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Summer Alert: రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ మార్పులు తీవ్ర సంక్షోభానికి దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  అంతర్జాతీయంగా విస్తరిస్తున్న సూపర్  ఎల్ నినో ప్రభావం ఈసారి వేసవిలో తీవ్ర రూపం దాల్చబోతున్నట్లు.. ఎండల తీవ్రత ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్ దాటే ప్రమాదం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జల మట్టాలు పాతాళానికి పడి పడిపోయాయని.. జీవనది గోదావరి సైతం నీరు లేక వెలవెలబోతోందని ఆయన స్పష్టం చేశారు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వంతపురం మండలంలోని అమ్మగారిపల్లి వద్ద ఉన్న గోదావరి ఆనకట్టను మంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు రైతులకు గడ్డు కాలాన్ని సూచిస్తున్నాయన్నారు.. ఎగువ ప్రాంతాల నుంచి ఆశించిన మేర వరద రాకపోవడంతో పాటు వర్షాలు లేకపోవడంతో గోదావరి బేసిన్‌లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడిందని ఆయన అన్నారు..

నదుల్లో నీరు లేకపోవడంతో పాటు జలాశయాలు అడుగంటి పోవడంతో, భూగర్భ జలాలు దారుణంగా పడిపోవడమే కాకుండా విద్యుత్ ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులు విస్తారంగా నీరు అవసరమయ్యే వారి పంట వైపు మొగ్గుచూపడం తీవ్ర నష్టాలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.  రైతాంగం ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని.. తక్కువ నీటితో పండే ఆరుతడి తో పాటు ప్రత్యామ్నాయక్ పంటలను మాత్రమే సాగు చేయాలని ఆయన పేర్కొన్నారు. పంటల ప్రణాళికలో మార్పులు చేసుకోకపోతే పెట్టుబడును సైతం దక్కే అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు..

రాబోయే కఠిన వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతూ ఉందని తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద యుద్ద ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కట్టపై ఇసుక బస్తాలు పేర్చి సుమారు ఒక టీఎంసీ నీటిని నిల్వ ఉంచేలా అత్యవసర పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. ఈ నిల్వ నీరు వేసవికాలంలో స్థానిక ప్రజలకు.. చుట్టుపక్కల ప్రాంతాలకు తాగునీటి అవసరాలను తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రకృతి విపత్తును ఎదుర్కొనేందుకు ప్రజలతో పాటు రైతాంగం ప్రభుత్వంతో సహకరించాలని ఆయన కోరారు..
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telangana News
Telangana Weather