SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

వికారాబాద్ జిల్లాలో పెద్ద పులి కలకలం.. భయాందోళనలతో ప్రజలు..

tiger in Vikarabad: వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పులి సంచారంతో చుట్టుపక్కల గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. కృష్ణగిరి క్షేత్ర ఆలయ పరిధిలోని గోశాలలోని గోవులపై పెద్దపులి దాడి చేసింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Sep 27, 2026, 10:29 AM IST | Updated: Sep 27, 2026, 02:01 PM IST
Image Credit: Tiger Vikrabad (ZEE News Telugu/Source)
Join

Tiger Fear: ఒకపుడు అడవులు నగరానికి దూరంగా ఉండేవి. వాటికి సహజ సిద్దంగా ఆహారం వంటివి దొరికేవి. దీంతో అవి ప్రజలు ఉండే నగరాల వైపు వచ్చేవి కావు. కానీ నగరాలు అడవులను కబలించడంతో అక్కడ ఆవాసం ఉండే జంతువులు అపుడపుడు నగరాల్లో పడి ఇక్కడ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో అడవులకు సమీపంలో ఉండే గ్రామంలో పులుల వంటి క్రూర జంతులు చొరబడి ప్రజలను భయాందోళలను గురి చేస్తున్నాయి.

ఇక అటవీ ప్రాంత విస్తీర్ణం ఎక్కువగా ఉండే వికారాబాద్‌లో తరుచుగా పులులు జనాల్లోకి వచ్చిన ప్రజలను పానిక్‌కు గురిచేస్తున్నాయి. పలు సందర్భాల్లో కొంత మందిని ఇవి పెట్టనపెట్టుకున్న సందర్భాలున్నాయి. దీంతో జూపార్క్‌కు చెందిన వేటగాళ్ల సహాయంతో వాటిని బంధించి సమీపంలోని అడువిలోకి లేకపోతే జూకు తరలిస్తున్నారు. తాజాగా వికారాబాద్ అడవులకు సమీపంలో ఉండే గోశాలలో ఓ ఫులి చొరబడి ఆవును గాయపరిచిన ఘటన పెద్దఎత్తున కలకలం రేపింది.  

అటవీప్రాంతంలో ఉండే గోశాల నుండి మూడు రోజుల క్రితమే ఓ లేగదూడను ఎత్తుకెళ్లిన క్రమంలో.. తాజాగా మరో ఆవుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గో సంరక్షకుడు గమనించి కేకలు వేస్తూ పరుగు తీయడంతో పులి అక్కడి నుంచి పారిపోయినట్టు చెబుతున్నారు. మెడ, ఉదర భాగంలో తీవ్ర రక్తగాయాలు కావడంతో పాటు వీపుపై పంజా ఆనవాళ్లు ఉన్న ఆవు చికిత్స పొందుతూ మృతి చెందింది. పక్కనే ఉన్న ఫామ్‌హౌస్ సీసీటీవీ కెమెరాల్లో పులి కదలికలు రికార్డయ్యాయి.

పులి శరీరంపై పొడవైన చారలు ఉన్నాయని... అది పెద్ద పులే అని గో సంరక్షులు చెబుతున్నారు. గోశాలలో దాదాపు 200 ఆవులు ఉన్నాయని, అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి పులిని బంధించి అటవీ ప్రాంతానికి తరలించాలని కోరారు గోశాల నిర్వాహకులు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES