• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Mahesh kumar goud: కొండా సురేఖను కాంగ్రెస్ అధిష్టానం పిలిచిందా..?.. బిగ్ షాక్ ఇచ్చిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..

Mahesh kumar goud: కొండా సురేఖను కాంగ్రెస్ అధిష్టానం పిలిచిందా..?.. బిగ్ షాక్ ఇచ్చిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..

Tpcc chief Mahesh kumar goud on brs: మాక్‌ అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ నేతలు బీసీ నేతకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా చేయాలని సవాల్‌ విసిరారు. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

Reported ByInamdar PareshEdited ByInamdar Paresh
Published: Sep 14, 2026, 02:20 PM IST|Updated: Sep 14, 2026, 02:26 PM IST
joinshare
Mahesh kumar goud: కొండా సురేఖను కాంగ్రెస్ అధిష్టానం పిలిచిందా..?.. బిగ్ షాక్ ఇచ్చిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..
Image Credit: kondasurekha(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

TPCC Chief Mahesh kumar goud intresting comments on brs mock assembly: తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల వరంగల్ లో కొండా సురేఖ దంపతులు తమ అనుచరులతో మీటింగ్ నిర్వహించారు. పదవులు ముఖ్యం కాదని, మాట ముఖ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటమే తమ టార్గెట్ అన్నారు. కార్యకర్తల కోసం ఎలాంటి త్యాగాలకైన వెనుకాడబొమన్నారు.ఈ క్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తాజాగా.. కొండా సురేఖ అంశంపై వినాయక చవితి పండగ వేళ చేసిన కామెంట్స్ కొత్త చర్చకు తెరతీశాయి.  ఇటీవల కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని వార్తలు వచ్చాయి. 

కొండా దంపతులకు కీలక పదవి ఆఫర్ చేశారని వార్తలు వచ్చాయి. అయితే దీనిలో భాగంగా కొండా సురేఖ వరంగల్ లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కానీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం ..కొండా సురేఖను కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఢిల్లీకి పిలిచిందన్న వార్తలపై తమకు ఎలాంటి సమాచారం లేదని గాంధీ భవన్ లో  మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. అంతే కాకుండా.. ప్రభుత్వ ఆస్తులను ఎవరైనా కబ్జా చేసి ఉంటే.. ఆ వ్యవహారాలు బయటకు రావాల్సిందేనంటూ తెల్చి చెప్పారు.

ఇక బీఆర్ఎస్ ఇటీవల నిర్వహించిన మాక్ అసెంబ్లీపై కూడా ఫైర్ అయ్యారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్‌ మాట తప్పారని ఆరోపించారు. కేవలం ఓట్ల కోసమే కేసీఆర్‌ దళిత కార్డును ఉపయోగించారని విమర్శించారు. 

దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు పథకాలను ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. అంబేద్కర్‌ విగ్రహాలు ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా ఆయన సూచనలను పాటించాలని బీఆర్ఎస్ కు చురకలు పెట్టారు. దళితులు నడిచిన నేలను శుద్ధి చేసిన ఘటనపై బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు.. బీఆర్ఎస్ పార్టీ వారు.. ‘‘నేలను కాదు.. మీ బుర్రను శుద్ధి చేయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను ప్రతిపక్ష నేతగా చేయాలని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌  అసెంబ్లీకి రావడం మానేశారని, కనీసం తలసానికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో పండగ వేళ పీసీసీ చీఫ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

 

Add Zee News as a Preferred Source