SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Khammam: వినాయక నిమజ్జనంవేళ పెను విషాదం.. ఖమ్మంలో రెండేళ్ల బాలుడు మృతి.. అసలేం జరిగిందంటే..?..

Two years boy dies tragedy in Khammam: రెండేళ్ల బాలుడు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో బాలుడిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలిస్తుండగా వినాయక నిమజ్జనంలో శోభయాత్రతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో బాలుడు కరెక్ట్ టైమ్ కు ఆస్పత్రికి వెళ్లలోక ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మంలో ఈ ఘటన పెను విషాదకరంగా మారింది.

Written By Inamdar Paresh
Published: Sep 25, 2026, 02:51 PM IST | Updated: Sep 25, 2026, 03:10 PM IST
Image Credit: Khammamnews(file)
Join

Two years boy dies in Khammam during ganesh immersion: తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనం కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ క్రమంలో ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు పటిష్టమైన బందో బస్తు చేపట్టారు. పలుచోట్ల వినాయక నిమజ్జనంవేళ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక డీజేలకు పోలీసులు అనుమతిని నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమ్మంలో వినాయక నిమజ్జనం వేళ పెనువిషాదం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా బోనకల్‌ ఎస్టీ కాలనీకి చెందిన భూక్యా సైదులు, విజయలక్ష్మి దంపతుల కుమారుడు వైభవ్‌ నాయక్‌ (2) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. 

బాలుడిని మొదట ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ సిట్యువేషన్ విషమించడంతో.. గురువారం ఖమ్మం నగరంలోని పాతబస్టాండ్‌ సమీపంలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో.. సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని జెడ్పీ సెంటర్‌ సమీపంలోని ఆస్పత్రికి అంబులెన్స్‌లో బయలుదేరారు. 

ఈ  నేపథ్యంలో స్థానికంగా వినాయక శోభయాత్రను నిర్వహిస్తున్నారు. దీంతో రోడ్డుమార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంబులెన్స్ లో రద్దీలో చిక్కుకునిపోయింది. ఆ సమయంలో బాలుడి తండ్రి సైదులు.. అంబులెన్స్‌ నుంచి కుమారుడిని బయటకు తీసి భుజాలపై మోసుకుంటూ ఆస్పత్రి వైపు పరుగులు తీశాడు. 

అప్పటికే బాలుడి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ వైభవ్‌ మృతిచెందాడు. సకాలంలో  ఆస్పత్రికి తీసుకెళ్లగలిగితే బతికేవాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES