ULC భూములకు క్లియరెన్స్.. ! సీఎం రేవంత్ సంచలనం..
ULC Lands: తెలంగాణ ప్రభుత్వ భూములపై రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ లండ్ సీలింగ్ (ULC) దరఖాస్తులకు మోక్షం లభించింది.మొత్తంగా ULC పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Urban Lanc Ceiling: ULC పెండింగ్ దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత ఉన్న ULC కేసులను పరిశీలించి క్రమబద్దీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. జీవో 455, 456,457, 92 కింద పెండింగ్ దరఖాస్తులపై ఉత్తర్వులు జారీ చేశారు. అర్హత ఉన్న కేసుల్లో నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరణకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజల భూ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ULC దరఖాస్తులకు మోక్షం లభించిందన్నారు.
2016లో జీవో జారీ చేసినా బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డారు. 22A సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు. జీవోలు 118, 76కు అనుగుణంగా ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయని.. మిగిలిన 22A సమస్యలకూ ఫాస్ట్‌ట్రాక్‌లో పరిష్కారిస్తామన్నారు మంత్రి పొంగులేటి.మొత్తంగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న యూఎల్‌సీ దరఖాస్తులకు మోక్షం లభించనుంది.
ULC దరఖాస్తుల పరిష్కారానికి Memo No.48062 జారీ చేసింది. అర్హత ఉన్న కేసుల్లో నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. 2016లో GO జారీ చేసినా గత ప్రభుత్వం అమలు చేయలేదున్నారు. 22-A సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్న ప్రజా ప్రభుత్వం.
మొత్తంగా CM రేవంత్ రెడ్డి అసెంబ్లీ హామీలకు కార్యరూపం ఇచ్చినట్టు మంత్రి పొంగులేని చెప్పారు. 22-Aలో ఉన్నా అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చారు. తాజాగా ULC పై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన 22-A సమస్యలకూ ఫాస్ట్‌ట్రాక్‌లో పరిష్కారం కలిగిస్తుందన్నారు.