SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Mancherial: గణేష్ నిమజ్జనంలో పరాయి మహిళతో భర్త డ్యాన్స్.. భార్య ఏంచేసిందో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం..

Ganesh immersion in Mancherial: నాలుగేళ్ల క్రితం సోనాపూర్ బాదుగూడకు చెందిన సంధ్య(23)కు జంగుతో పెళ్లి అయ్యింది. అయితే గ్రామంలో నిర్వహించిన వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా.. భర్త ఇతర మహిళలతో కలిసి స్టెప్పులు వేశాడు. దీంతో భార్య సంధ్య తీవ్ర మనోవేదనకు గురైంది. మంచిర్యాలలో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.

Written By Inamdar Paresh
Published: Sep 26, 2026, 06:13 PM IST | Updated: Sep 26, 2026, 06:17 PM IST
Image Credit: sandhyasucideinmancherial(file)
Join

Ganesh immersion dance tragedy in mancherial: తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనం ఎంతో వేడుకగా జరిగింది.  గణేష్ నిమజ్జనంలో అన్నివయసులోని వారు ఎంతో జోష్ తో పాల్గొన్నారు.అదిరిపోయే స్టెప్పులు వేస్తు వినాయకుడికి గ్రాండ్ గా గంగమ్మ ఓడికి వీడ్కొలు పలికారు. తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు కూడా గట్టి బందో బస్తు చేపట్టారు. అయితే.. వినాయక నిమజ్జనంలో తన భర్త పరాయి మహిళతో కలిసి డ్యాన్స్ చేశాడని ఒక మహిళ ఏకంగా సూసైడ్ కు పాల్పడింది. మంచిర్యాలలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదకరంగా మారింది.

మంచిర్యాల జిల్లా  కాసిపేట మండలం, దొడ్డిగూడెంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం సోనాపూర్ బాదుగూడకు చెందిన సంధ్య(23)కు స్థానికంగా ఉంటే జంగు అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. అప్పటి నుంచి ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండే వారు. అయితే ఇటీవల గ్రామంలో  వినాయక నిమజ్జన వేడుకలు నిర్వహించారు. 

దీనిలో భర్త జంగు.. తనతో కాకుండా.. ఇతర మహిళలతో కలసి డ్యాన్స్ చేశాడు.  దీంతో   సంధ్య తీవ్ర మనోవేదనకు గురైంది.   నా ముందే భర్త ఇతర మహిళలతో డ్యాన్స్ చేయడాన్ని తట్టుకోలేక పోయింది. ఈ బాధలోనే ఇంట్లోకి వెళ్లి పురుగుల మందుతాగి సంధ్య ఆత్మహత్యకు పాల్పడింది. 

వెంటనే కుటుంబ సభ్యులు సంధ్యను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సదరు మహిళ కన్నుమూసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది.  మహిళ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES