SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Yadadri Temple: యాదగిరిగుట్ట కొండపై మహిళ మృతి.. దర్శనాలు నిలిపివేత.. ఏంజరిగిందంటే..?..

Woman dies in yadadri hills: వేగంగా దూసుకొచ్చిన కారు కొండపై మహిళను బలంగా ఢీకొనడం వల్ల మహిళ స్పాట్ లోనే చనిపోయింది. ఈ ఘటనతో ఒక్కసారిగా యాదాద్రిలో గందర గోళం తలెత్తింది. పోలీసులు ఘటన స్థలంకు చేరుకుని విచారణ చేపట్టారు.

Reported By Inamdar Paresh Written By Inamdar Paresh
Published: Sep 22, 2026, 05:38 PM IST | Updated: Sep 22, 2026, 05:46 PM IST
Image Credit: womandiesonyadadrihills
Join

Woman dies after car accident in yadadri hills: తెలంగాణలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని చాలా మంది భక్తులు దర్శించుకుంటారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల  నుంచి కూడా భక్తులు భారీగా తరలి వచ్చి లకీనర్సింహ స్వామిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. ఈ రోజుపరివర్తిని ఏకాదశి పర్వదినం నేపథ్యంలో యాదాద్రికి భక్తులు పొటెత్తారు. ఉదయం నుంచి క్యూలైన్ లలో వేచి ఉన్నారు. అయితే యాదాద్రిలో అనుకొని  షాకింగ్ ఘటనచోటు చేసుకుంది. దీంతో ఆలయ దర్శనాలను పండితులు, దేవాలయ సిబ్బంది తాత్కలికంగా నిలిపివేశారు.


యాదాద్రి లక్కీనర్సింహ స్వామి ఆలయం కొండపై  ఘోర రోడ్డు ప్రమాదం  చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం కొండపై కారు వేగంగా వచ్చి ఒక మహిళలను బలంగా ఢీకొనడంతో ఆమె స్పాట్ లోనే చనిపోయింది. ఆమె తలకు తీవ్ర గాయామైరక్తస్రావమైంది.  ఈ ఘటనతో కొండపై ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ఘటన స్థలంకు చేరుకున్నారు.  రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మహిళను ఈశ్వరమ్మ గా అక్కడి వారు గుర్తించారు. 

భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తుందని చెప్పారు. ఆమె డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.  కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. ఆలయ  నియమావళి ప్రకారం.. కొండపై మరణం సంభవించడంతో ఆలయ ద్వారాలు మూసివేయడంను ఆనవాయితీగా పాటిస్తు వస్తున్నారు. 

ఈ ఘటనతో ఆలయం దర్శనాలను నిలిపివేశారు.  శాస్త్రోక్తంగా ఆలయ శుద్ధి, సంప్రోక్షణ పూజా కార్యక్రమాలు పూర్తి చేశాక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనాల పునరుద్ధరణ చేశారు. ప్రస్తుతం యథా ప్రకారం భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. ఒకవైపు పరివర్తిని ఏకాదశి నేపథ్యంలో కొండపై  భక్తులు భారీగా తరలివచ్చారు. 

ఈ విషాద ఘటనతో  భక్తులు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు నడిపించే టప్పుడు జాగ్రత్తగా, వేగం కంట్రోల్ లో ఉండేలా చూసుకుని వాహనాలు నడిపించాలని పోలీసులు సూచిస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES