SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Hyderabad: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. వదినపై దాడి చేసిన మరిది..అసలు విషయం ఇదే.!.

Family dispute in Hyderabad: ఆస్తి పత్రాల తీసుకోవడంతో పాటు తన పేరుపై రుణాలు తీసుకొని.. ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని సౌమ్య ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల తన మరిది తనపై దాడి చేశాడని చెప్పుకొచ్చింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Written By Inamdar Paresh
Published: Oct 22, 2026, 03:39 PM IST | Updated: Oct 22, 2026, 03:48 PM IST
Image Credit: Hyderabadcrime(file)
Join

Woman files complaint against husband in Hyderabad: ఇటీవల భార్యభర్తలు తరచుగా ఒకరిపై మరోకరు దాడులు చేసుకుంటున్నారు. నిత్యం  ఇలాంటి ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. పెళ్లి చేసుకుని అన్యోన్యంగా ఉండకుండా పరస్పరం దాడులు చేసుకుని డైవర్స్ వరకు వెళ్లిపోతున్నారు. కొంత మంది హత్యలు చేయడంకు సైతం వెనుకాడటంలేదు.  ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో ఆస్తి వివాదం నేపథ్యంలో భార్యభర్తలు గొడవలు పడ్డారు. ఈ ఘటన స్థానికంగా దుమారంగా మారింది. 

హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. విజయ్ కుమార్, సౌమ్య ఇద్దరు భార్యభర్తలు. వీరు ఫిలింనగర్‌లో ఉంటున్నారు. అయితే.. భర్త ఉద్యోగం చేయకుండా తన బంగారు ఆభరణాలు తీసుకున్నాడని భార్య తరచుగా ఇంట్లో వాగ్వాదంకు దిగేది. ఇటీవల ఈ గొడవలు కాస్త తారాస్థాయికి చేరాయి. దీంతో మహిళ కాస్త ఫిలింనగర్ పీఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

ఆస్తి పత్రాల తీసుకోవడంతో పాటు తన పేరుపై రుణాలు తీసుకొని.. ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని సౌమ్య ఆవేదన వ్యక్తం చేసింది.  ఈ క్రమంలోనే ఈ నెల 20న ఇంట్లో వివాదం జరిగింది. దీంతో మరిది సురేశ్ కుమార్ తన చేతులు, కాళ్లపై కొరికాడని సౌమ్య పోలీసులకు ఫిర్యాదుచేసింది. 

అంతే కాకుండా తనను చంపుతానని కూడా సురేశ్ కుమార్ బెదిరింపులకు పాల్పడ్డాడని తన ఫిర్యాదులో పేర్కొంది. ఇక మరోవైపు.. కుటుంబ వివాదంలో తనపై వదిన దాడి చేసిందని సురేష్ కుమార్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పరస్పరం ఫిర్యాదులు రావడంపై పోలీసులు స్వీకరించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర వివాదాస్పదంగా మారింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES