SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

DJ Sound Death: సద్దుల బతుకమ్మ వేడుకల్లో డీజే సౌండ్‌కు కుప్పకూలిన మహిళ.. పండుగ ఆనందం ఆవిరి

Women Collapse While Dancing In Saddula Bathukamma: అంగరంగ వైభవంగా జరిగిన బతుకమ్మ సంబరాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సంబరాల్లో డీజే శబ్దానికి ఓ మహిళ కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించేలోపు మృతిచెందారు. ఇక పలు ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో పలువురు దుర్మరణం చెందారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 19, 2026, 02:54 PM IST | Updated: Oct 19, 2026, 03:06 PM IST
Image Credit: DJ Sound Death In Bathukamma Celebrations
Join

DJ Sound Women Death: తెలంగాణలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఈ సంబరాల కోసం పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనగా పలుచోట్ల అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. దేవీ నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలు, దసరా పండుగ సందర్భంగా ప్రయాణాల సమయంలో ప్రమాదాలు చోటుచేసుకోగా.. మరో చోట సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళ డీజే శబ్దానికి కుప్పకూలింది. తీరా ఆస్పత్రికి తరలించగా ఆమె మృతిచెందింది. తెలంగాణలో చోటుచేసుకున్న ప్రమాదాల వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామంలో డీజే సౌండ్‌తో ఓ మహిళ మృతిచెందింది. సద్దుల బతుకమ్మ సందర్భంగా డీజే ఏర్పాటు చేశారు. అప్పలనర్సింహాపురం గ్రామానికి చెందిన యలగాల భారతి అనే మహిళ డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలింది. దసరా పండగ కోసం తన పుట్టిళ్లు చెరువు మాదారం గ్రామానికి వచ్చింది. సద్దుల బతుకమ్మ సందర్భంగా గ్రామంలో ఏర్పాటుచేసిన డీజే వద్ద డాన్స్ చేస్తూ భారతి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించినప్పటికి అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. దీంతో ఆ కుటుంబంతోపాటు గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. పండుగ ఆనందం లేకుండాపోయింది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
హైదరాబాద్‌ శివారులో అలియాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలియాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అలియాబాద్ ఎక్స్‌ రోడ్డు నుంచి అలియాబాద్ గ్రామానికి వెళ్తుండగా హార్డ్‌వేర్‌ షాపు వద్ద ఆర్‌15 ద్విచక్ర వాహనం అతివేగంగా నడుపుతూ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన కాస్మోస్‌ (22), సుమిత్‌ (23)గా గుర్తించారు. కంపెనీలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు జీనోమ్‌ వ్యాలీ సీఐ గురువయ్య తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో పూజారి మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ప్రమాదంలో ఓ పూజారి ఘటనా స్థలంలోనే మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శారద కృష్ణ (60) కొన్నేళ్లుగా మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని చెట్లగౌరారం గ్రామ పరిధిలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో పూజారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పరిశ్రమ ప్రాంగణంలోనే నివాసం ఉంటున్నారు. ​సోమవారం ఉదయం శారద కృష్ణ తన ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనంపై మేడ్చల్ వైపు వస్తుండగా డబీల్‌పూర్ చౌరస్తా సమీపంలోని పంజాబీ దాబా వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలవడంతో ఆయన ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. ​సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES