Trainee IPS Case: ట్రైనీ ఐపీఎస్ ఘటనలో మరో బిగ్ ట్విస్ట్.. కేసులో ఏ2 గా ఉదయ్ కృష్ణారెడ్డి సోదరుడు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?
Trainee ips Uday krishna reddy case: హైదరాబాద్ పోలీసు అకాడమిలో తోటి మహిళ ఐపీఎస్ ట్రైనీపై దాడి ఘటనలో ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. దీనిలో తాజాగా.. ఉదయ్ కృష్ణారెడ్డి సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డిని పోలీసులు ఈ కేసులో ఏ2గా చేర్చారు.
Hyderabad trainee ips uday krishna reddy case: హైదరాబాద్ లో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తన తోటి మహిళ ట్రైనీ ఐపీఎస్ ను వేధించి, దాడి చేసిన ఘటనలో అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో అత్తాపూర్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఇటీవల ఉప్పర్ పల్లి కోర్టు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ను మంజురు చేసింది. మరోవైపు ఈ ఘటనలో పోలీసలు దర్యాప్తు వేగంను పెంచారు.
తాజాగా.. ఈ కేసులో పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డి సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డిని కేసులో ఏ2గా చేర్చారు. ముఖ్యంగా ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ కు యత్నించినప్పుడు ఆయన రాసిన సూసైడ్ నోట్ ను మాయం చేసినట్లు పోలీసులు దర్యాప్తులో కనుగొన్నారు.
మరో ఐఫోన్ ను కూడా మాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కీలక ఆధారాల్ని మాయం చేసి, దర్యాప్తుకు జాప్యం కలిగేలా చేసినందుకుగాను అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డి సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డిని ఈ కేసులో ఏ2 గా చేర్చి విచారణ చేపట్టారు.
మరోవైపు పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ప్రణయ్ కృష్ణారెడ్డి ముందుజాగ్రత్తగా కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమిలో తోటి మహిళ ఐపీఎస్ ను లైంగికంగా వేధించి దాడి చేసిన ఘటనలో బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు జులై 18న కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఆతర్వాత అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.