• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /Rajagopal Reddy: సీఎం రేవంత్ టార్గెట్‌గా వ్యాఖ్యలు.. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఫోన్ కాల్.!.

Rajagopal Reddy: సీఎం రేవంత్ టార్గెట్‌గా వ్యాఖ్యలు.. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఫోన్ కాల్.!.

Congress high command on cm revanth reddy: రాజగోపాల్ రెడ్డిపై ఇప్పటికే తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉంది. ఈ క్రమంలో కొత్త తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీతో భేటీ అవ్వాలని ఆయనకు పీసీసీ కాల్ చేసింది. దీంతో మరోసారి మునుగోడు ఎమ్మెల్యే అంశం హాట్ టాపిక్ గా మారింది.

Written ByInamdar Paresh
Published: Nov 21, 2026, 13:00 IST|Updated: Nov 21, 2026, 13:54 IST
joinshare
Rajagopal Reddy: సీఎం రేవంత్ టార్గెట్‌గా వ్యాఖ్యలు.. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్  ఫోన్ కాల్.!.
Image Credit: komatireddyrajagopalreddy(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Congress High Command Calls Munugude mla rajgopal reddy: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మనుగోడు  ఎమ్మెల్యే అంశంపై రాజకీయంగా దుమారంగా మారింది. సొంతపార్టీ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై అపోసిషన్ పార్టీల నేతల కన్నాఎక్కువగా విమర్శాణాస్త్రాల్ని సంధిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఈ మాటల యుద్దం కాస్త పీక్స్ కు చేరింది. అయ్యప్ప మాలలో కూడా ఉన్నాకూడా సీఎం రేవంత్ పై రాజగోపాల్ రెడ్డి పదునైన విమర్శల్ని ఎక్కుపెట్టారు. ఇటీవల సీఎం రేవంత్ భాషపై, తన నియోజక వర్గంకు నిధులు కేటాయింపు చేయకపోవడంపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కేవలం సీఎం, మంత్రుల నియోజక వర్గాలకు నిధుల్ని కేటాయించడం, ఇతర నియోజక వర్గాల్ని నిధుల్ని కేటాయించక పోవడంపై రాజగోపాల్  రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉంది కదా అని రెచ్చిపొవద్దని ఎక్స్ వేదికగా ఏకీపారేశారు.  

మూడేళ్లు ప్రజలకు ఇచ్చిన హమీల్ని నెరవేర్చకుండా మోసం చేశారని చివరి రెండెళ్లయిన సరైన పాలన అందించాలన్నారు. నిధులు అడిగితే పండపెట్టి తొక్కుతా అనడం ఏంటనిఫైర్ అయ్యారు. మరోవైపు సీఎం సైతం కొంత మంది నేతలు పిచ్చికుక్కల్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి అంశంపై ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.

 డిసిప్లినరీ  కమిటీ అన్ని గమనిస్తుందన్నారు. తమకు అందరు నేతలు సమానమే అంటూ తెల్చి చెప్పారు. తాజాగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కర్ణాటకకు చెందిన బీఎం సందీప్ తెలంగాణకు నూతన కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీగా నియమితులైన విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో తెలంగాణ పీసీసీ రాజగోపాల్ రెడ్డి వివాదంను  బీఎం సందీప్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో బీఎం సందీప్ ను 23న కలవాలంటూ రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేసి AICC కార్యదర్శి సచిత్ సావంత్ సూచించారు. 

నవంబర్ 23వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇంచార్జి బీఎం సందీప్ తో రాజగోపాల్ రెడ్డి సమావేశం జరుగనుంది. మరోవైపు ఇటీవల ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల నేపథ్యంలో మంత్రి పదవి దాదాపుగా ఆయనకు దక్కదని రాజకీయాల్లో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ ఏవిధంగా చర్యలు తీసుకుంటుందో అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Congress
Telugu News