SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Balmoor Venkat: కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం.. ఇద్దరికి స్వల్పగాయాలు.!.

Mlc Balmoor venkat car accident: తిరుమల శ్రీవారిని దర్శించుకుని హైదరాబాద్ కు వస్తుండగా ఎమ్మెల్సీ బల్మూరీ వెంకట్ ప్రయాణిస్తున్న కారును లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది. డ్రైవర్ తో పాటు ఎమ్మెల్సీ సోదరుడికి స్వల్పగాయాలయ్యాయి.

Written By Inamdar Paresh
Published: Nov 18, 2026, 11:46 IST | Updated: Nov 18, 2026, 11:54 IST
Image Credit: balmoor venkat car accident news
Join

Mlc Balmoor Venkat family escaped from car accident: కాంగ్రెస్ నేతలు ఇటీవల వరుసగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఇటీవల రోడ్డు ప్రమాదం నుంచి  వెంట్రుక వాసిలో ప్రమాదం నుంచి బైటపడ్డారు.  ఒకే రోజు రెండు సార్లు ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదంకు గురైంది. ఈ  ఘటన మరువక ముందే మరో కాంగ్రెస్ కీలక నేత ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ రోడ్డు ప్రమాదంకు గురికావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన కల్గించే అంశంగా మారింది.

 

 

కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్  ఇటీవల తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో తిరుపతి నుంచి వస్తుండగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదంకు గురైంది.  జాతీయ రహదారిలో కారును వెనక నుంచి వేగంగా వచ్చిన  లారీ ఢీకొట్టింది.ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది.  

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సోదరుడు చాణక్య, డ్రైవర్ శ్రీకాంత్ కు స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు కారులో వెనుక వైపుకు కూర్చున్న  ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ దంపతులు మాత్రం ఎయిర్ బ్యాగ్ లు ఓపెన్ కావడంతో స్వల్పగాయాలతో పెద్ద ప్రమాదంనుంచి బైటపడ్డారు. వెంటనే ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసి, మరో కారులో  ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కుటుంబాన్ని అక్కడి నుంచి తరలించారు. 

ఈ ఘటనతో ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారు ప్రమాదం విషయం తెలియగానే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES