• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /బాలకృష్ణ vs నాగార్జున బాక్సాఫీస్ వార్‌లో మరో స్టార్ హీరో..

బాలకృష్ణ vs నాగార్జున బాక్సాఫీస్ వార్‌లో మరో స్టార్ హీరో..

Nagarjuna King 100 Vs Balakrishna Dada: ఈ ఏడాది క్రిస్మస్ బాక్సాఫీస్ రేస్ మాత్రం మామూలుగా ఉండేలా కనిపించడం లేదు. ఇప్పటికే పలు భారీ సినిమాలు ఇయర్ ఎండ్‌ హాలీడేస్‌ను టార్గెట్‌గా తమ రిలీజ్ డేట్స్‌ను లాక్ చేసుకుంటుండటంతో బాక్సాఫీస్ దగ్గర అసలైన పోరు మొదలైంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు.. అటు హాలీవుడ్ సినిమాలు కూడా ఈ క్రిస్మస్ రేసులో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఈసారి క్రిస్మస్ సీజన్ సినీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వబోతోంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 07, 2026, 01:06 PM IST|Updated: Nov 07, 2026, 01:10 PM IST
joinshare
బాలకృష్ణ vs నాగార్జున  బాక్సాఫీస్ వార్‌లో మరో స్టార్ హీరో..
Image Credit: Balakrishna Vs Nagarjuna Vs Shah Rukh (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
రూ. 200 లకే అదిరిపోయే ఆఫర్.. 30GB డేటాతో పాటు ఉచిత యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్!

రూ. 200 లకే అదిరిపోయే ఆఫర్.. 30GB డేటాతో పాటు ఉచిత యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్!

2

Surekha Vani: నా అకౌంట్ హ్యాక్ చేశారు.. టీనేజ్ కుర్రాడితో లీక్ వీడియోపై సురేఖ వాణి కీలక ప్రకటన..

3

దీపావళి రాత్రి గుడ్లగూబ కనిపించిందా? లక్ష్మీదేవి అనుగ్రహం లభించబోతున్నట్టేనా?

4

రెండో రోజు ‘రామాయణ’కు షాకింగ్ కలెక్షన్స్.. ఇది ఊహించినది..

5

బాలకృష్ణ vs నాగార్జున బాక్సాఫీస్ వార్‌లో మరో స్టార్ హీరో..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Balayya Vs Nagarjuna: ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే ఈసారి పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, కింగ్ అక్కినేని నాగార్జున తమ సినిమాలతో బాక్సాఫీస్ బరిలో నిలవబోతున్నారు. బాలయ్య నటిస్తున్న సినిమా, నాగార్జున కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా ఒకే డేట్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పటికే ఈ రెండు చిత్రాల రిలీజ్ డేట్‌ను అపీషియల్‌గా ప్రకటించడంతో ఈ సినిమా క్లాషెస్ పై పెద్ద ఆసక్తి నెలకొంది.

నందమూరి వర్సెస్ అక్కినేని..

ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు ఒకే సమయంలో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే అభిమానుల్లో ఉండే సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్యకు మాస్ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ ఒక ఎత్తయితే.. నాగార్జునకు మహిళా, క్లాస్ ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ మరో ఎత్తు. దీంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ పోటీని మరింత రసవత్తరంగా మార్చేందుకు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. షారుఖ్ హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ యాక్షన్ రివెంజ్ డ్రామా 'కింగ్' కూడా ఇదే క్రిస్మస్ రేసులో దిగబోతోంది. ఇప్పటికే రిలీజ్ డేట్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.  ఇప్పటికే ఈ సినిమా విడుదలకు సంబంధించిన ప్రచారం ఊపందుకోగా.. తెలుగులో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

ముఖ్యంగా కొన్ని మల్టీప్లెక్స్‌ల వద్ద 'కింగ్' సినిమాకు సంబంధించిన తెలుగు హోర్డింగ్స్ కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో షారుఖ్ ఖాన్ సినిమాను కేవలం హిందీ మార్కెట్‌కే పరిమితం చేయకుండా తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకురాబోతున్నారు. గతంలో  పఠాన్, జవాన్ సహా పలు సినిమాలు తెలుగు డబ్బింగ్ ఇరగదీశాయి. ఓ రకంగా బాలయ్య, నాగార్జున సినిమాలకు మరో భారీ పోటీ ఎదురైనట్టే.కానీ షారుఖ్ సినిమా తెలుగుపై పెద్దగా ఇంపాక్ట్ చూపెట్టే అవకాశాలు లేవు. బాలయ్య, నాగార్జునలు ఈ విషయంలో ఊపిరి పీల్చుకోవచ్చు. మరోవైపు ఈ రెండు రీజనల్ లాంగ్వేజ్‌లో రాబోతుంది.

షారుఖ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఇమేజ్.. 

ఇప్పటికే షారుఖ్ ఖాన్‌కు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి గుర్తింపు ఉంది. ఆయన సినిమాలకు హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా మార్కెట్ ఉండటంతో 'కింగ్' సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక యాక్షన్, రివెంజ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే మాస్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునే అవకాశం ఉంటుంది.

మరోవైపు క్రిస్మస్ హాలిడే సీజన్ కావడంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మూడు భారీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే థియేటర్ల కేటాయింపులు, ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్, కలెక్షన్ల విషయంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. అయితే షారుఖ్ సినిమా కేవలం హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో మాత్రమే మార్కెట్ ఉంది. ఏపీ, తెలంగాణలోని  బీ, సీ సెంటర్స్‌లో షారుఖ్ సినిమా నాగ్, బాలయ్య సినిమాలకు పెద్దగా పోటీ ఇవ్వకపోవచ్చు.

అయితే ఇక్కడ మరో కీలకమైన విషయం ఏమిటంటే.. ఒకే సమయంలో ఇన్ని పెద్ద సినిమాలు విడుదలైతే ఏ సినిమాకు ఎక్కువ స్క్రీన్లు దక్కుతాయి? ఏ హీరో సినిమా భారీ ఓపెనింగ్స్ సాధిస్తుంది? తెలుగు ప్రేక్షకులు బాలయ్య, నాగ్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తారా? లేక షారుఖ్ 'కింగ్' సినిమాకు కూడా భారీగా క్యూ కడతారా? అన్నది చూడాలి. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పోటీ బాలకృష్ణ,  నాగార్జున మధ్య ఉండనుంది. కింగ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కొద్ది మేర ప్రభావం చూపించే అవకాశాలున్నాయి.

 ప్రస్తుతానికి 'కింగ్' తెలుగు రిలీజ్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయినప్పటికీ కనిపిస్తున్న సంకేతాలు మాత్రం ఈ క్రిస్మస్ బాక్సాఫీస్ వార్ మరింత ఆసక్తికరంగా మారబోతోందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

బాలయ్య Vs నాగార్జున Vs షారుఖ్.. 

మొత్తానికి ఈసారి క్రిస్మస్‌కు టాలీవుడ్‌లో బాలయ్య వర్సెస్ నాగార్జున పోటీతో పాటు బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్ కూడా బరిలోకి దిగితే బాక్సాఫీస్ దగ్గర అసలైన పండగే అని చెప్పాలి. మరి ఈ ముగ్గురు స్టార్ హీరోల్లో ప్రేక్షకుల మనసు ఎవరు గెలుచుకుంటారు? బాక్సాఫీస్ దగ్గర ఎవరు అసలు సిసలు కింగ్‌గా  నిలుస్తారనేది చూడాలి? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie
Bollywood