• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /రెండో రోజు ‘రామాయణ’కు షాకింగ్ కలెక్షన్స్.. ఇది ఊహించినది..

రెండో రోజు ‘రామాయణ’కు షాకింగ్ కలెక్షన్స్.. ఇది ఊహించినది..

Ramayana 2nd Day Box Office Collection: రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా.. యశ్ రావణాసురుడిగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రామాయణం’. దీపావళి కానుకగా గురువారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఫస్ట్ డే ఓ మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండో రోజు డీసెంట్ వసూళ్లను సాధిస్తోంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 07, 2026, 01:39 PM IST|Updated: Nov 07, 2026, 01:42 PM IST
joinshare
రెండో రోజు ‘రామాయణ’కు షాకింగ్ కలెక్షన్స్.. ఇది ఊహించినది..
Image Credit: Ramayana 2nd Collection (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Rice Price In India: పండగపూట కేంద్రం గుడ్‌న్యూస్.. భారీగా తగ్గనున్న బియ్యం ధరలు? కేంద్రం మాస్టర్ ప్లాన్

Rice Price In India: పండగపూట కేంద్రం గుడ్‌న్యూస్.. భారీగా తగ్గనున్న బియ్యం ధరలు? కేంద్రం మాస్టర్ ప్లాన్

2

దీపాలు పెట్టడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందా? లైట్ థెరపీకి దీపావళికి ఉన్న లింక్ ఇదే!

3

Garapati Divya: మరణం తర్వాత వెలువడిన ఫలితాలు.. ఎంపీటీసీగా గెలిచిన జనసేన అభ్యర్థి దివ్య..

4

పండక్కి ‘కాకా’వెనక్కి తగ్గేదే లే.. మెగాధీమా అదేనా..!!

5

Kavya Kalyanram Kala Bhairava: కీరవాణి ఇంట పెళ్లి సందడి.. 'బలగం' హీరోయిన్‌తో కాలభైరవ నిశ్చితార్థం! డిసెంబర్‌లో పెళ్లి?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ramayana box Office Collection: ‘రామాయణ’ సినిమాను తీయాలంటే తెలుగు వాళ్లే తీయాలి. బాపు సహా పలువురు తెలుగు దర్శకులు తెరపై చూపించిన ఎమోషన్‌ను బాలీవుడ్ దర్శకులు చూపించలేదనే కామెంట్స్ వినబడుతున్నాయి. మొత్తంగా రామాయణం అనేది హిందీ చిత్ర పరిశ్రమకు ఓ సరుకుగా మారింది.ఎవరెన్ని సార్లు ఏ రకంగా తెరకెక్కించినా చూస్తూనే ఉన్నారు.అందులో ఎమోషన్, డెప్త్, సహా అన్ని అంశాలు కుదిరితే నెత్తినపెట్టుకుంటారు. ఇక తెలుగు సహా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘రామాయణ’ .. ఆదిపురుష్ కంటే బెటర్‌గా ఉంది కానీ.. రామాయణం ఫీల్ రాలేదనే కామెంట్స్ వచ్చాయి. సీతారాముల మధ్య బాండింగ్ సరిగా లేదనే కామెంట్స్ వినబడ్డాయి. మరోవైపు సీతాదేవిని యోధురాలి పాత్రలో చూపించడాన్ని రామాయణ ప్రియులు తప్పుపడుతున్నారు. రామాయణాన్ని ఉన్నది ఉన్నట్టు తెరకెక్కిస్తే తప్పు లేదు కానీ.. కల్పిత అంశాలను జోడించడం ఎందుకనే కామెంట్స్ వినబడ్డాయి. పైగా రామాయణాన్ని ఒకే పార్టులో తీసే అవకాశాలున్నా.. రెండు భాగాలుగా తీయడం ఏమిటనే కామెంట్స్ వినపడ్డాయి. మొదటి భాగాన్ని మూడు కాండల్లో అరణ్య కాండలో సీతాపహరణంతో  ముగించాడు. రెండో భాగం కోసం ప్రేక్షకులు ఎన్నేళ్లు వెయిట్ చేస్తారనేది చూడాలి.

రామాయణ విజువల్ గ్రాండియర్.. 

మొత్తంగా విజువల్ గ్రాండియర్‌‌గా ‘రామాయణ’ను వేలు పెట్టి చూడాల్సిన అవసరం రాలేదు. అక్కడక్కడ ఎమోషన్స్ గట్రా మిస్ అయినా.. ‘రామాయణ’ తొలి భాగానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అందులో ఓవర్సస్, హిందీ వెర్షన్ నుంచే ఎక్కువ వసూళ్లు వచ్చాయి.

దీపాళి వీకెండ్ పై రామాయణ ఆశలు.. 

ఇక హిందీలో తొలి రోజు రూ. 47 కోట్లు.. శుక్రవారం రెండో రోజు రూ. 38.25 కోట్లు రాబట్టింది. మొత్తంగా హిందీ వెర్షన్‌లో రూ. 85.25 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. మన దేశంలో అన్ని భాషల్లో కలిపి రూ. 135 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సస్‌లో రూ. 87 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కించుకుంది. కన్నడలో 5.15 కోట్ల గ్రాస్.. తెలుగులో రూ. 4.75 కోట్ల గ్రాస్.. తమిళంలో రూ. 1.50 కోట్లు.. మలయాళంలో రూ. 1.15 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. మొత్తంగా శనివారం, ఆదివారంతో పాటు సోమ, మంగళ, బుధవారాల్లో ఈ సినిమా ఏ మేరకు మంచి వసూళ్లను రాబట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బుక్ మై షోలో ఈ సినిమా గంటకు 70 వేల నుంచి 80 వేల టిక్కెట్స్ అమ్ముడుపోతున్నాయి.అవి కూడా 3డీ ఫార్మాట్‌లోనే ఎక్కువ మంది చూడటానికి మొగ్గు చూపుతున్నారు.  మొత్తంగా రామాయణం సినిమా మొదటి భాగం ఏ మేరకు వసూళ్లను రాబడుతుందనేది చూడాలి మరి.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Bollywood
Telugu News
Telugu Movie