SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Dasara Festival: దసరా, బతుకమ్మ పండగలు.. సైబరాబాద్ పోలీసుల బిగ్ అలర్ట్.. అసలు విషయం ఇదే..

Dasara festival celebrations: ముఖ్యంగా లాక్ లు పెట్టిన కూడా బైటకు కన్పించకుండా కార్టన్ పెట్టాలని సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు. అంతే కాకుండా తమ ఏరియా పరిధిలోని పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.

Written By Inamdar Paresh
Published: Oct 10, 2026, 01:16 PM IST | Updated: Oct 10, 2026, 01:28 PM IST
Image Credit: Hyderabadnews(file)
Join

Cyberabad Police key advices to families on dasara and bathukamma: రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా పండగ శోభ కన్పిస్తుంది. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. దీంతో చాలా మంది తమ సొంతూర్ల బాటపట్టారు. ఇప్పటికే ప్రయాణికులతో బస్ స్టేషన్లు, రైల్వేలు, రోడ్లన్ని ట్రాఫిక్ తో కిట కిట లాడుతున్నాయి. 

చాలా మంది దసరా సెలవులలో తమ సొంతూర్లకు  లేదా బంధువుల ఇంటికి లేదా టూర్లకు ప్లాన్ లు చేస్తారు. అయితే.. ఇదే అదనుగా భావించిన దొంగలు తమ చేతివాటం చూపిస్తారు. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసులు ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. 

ముఖ్యంగా ఇంటికి తాళం వేసుకుని వెళ్లే వారు దగ్గరలోని పోలీస్ స్టేషన్ లలో సమాచారం ఇవ్వాలని కోరారు. అంతే కాకుండా బంగారం, డబ్బులను ఇంట్లో పెట్టకుండా లాకర్ లో పెట్టుకొవాలని సూచించారు. పిల్లలను రద్దీగా ఉండే ప్రదేశాల్లో జాగ్రత్తగా చూసుకొవాలని సూచించారు. 

ఇక వాహనాలను చైన్ లతో, ఇంటి తాళాలు సెంట్రలైజ్ గా ఉండేలా చూసుకొవాలని చెప్పుకొచ్చారు. ఎక్కడైన అనుమానితులు కన్పిస్తే వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES