• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /హైదరాబాద్‌ లో దీపావళి సంబరాల్లో తీవ్ర అపశ్రుతి.. పలు ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు, పలువురికి గాయాలు!

హైదరాబాద్‌ లో దీపావళి సంబరాల్లో తీవ్ర అపశ్రుతి.. పలు ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు, పలువురికి గాయాలు!

హైదరాబాద్లో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఫైర్ క్రాకర్స్ కాలుస్తూ ఆనందంగా గడిపారు. భాగ్యనగరం అంతా దీపాల కాంతులతో నిండిపోయింది; గచ్చిబౌలి నుంచి నగర శివారుల వరకు పండుగ సందడి నెలకొంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ దీపావళి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది, పలువురికి గాయాలయ్యాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 09, 2026, 07:57 AM IST|Updated: Nov 09, 2026, 07:59 AM IST
joinshare
హైదరాబాద్‌ లో దీపావళి సంబరాల్లో తీవ్ర అపశ్రుతి.. పలు ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు, పలువురికి గాయాలు!
Image Credit: Diwali Celebrations In Hyderabad

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
ఎయిర్‌టెల్ 1+1 ఉచిత రీఛార్జ్ ధమాకా..! డబుల్ బెనిఫిట్స్ ఇచ్చే రూ.349, రూ.399 ప్లాన్స్ ఇవే!

ఎయిర్‌టెల్ 1+1 ఉచిత రీఛార్జ్ ధమాకా..! డబుల్ బెనిఫిట్స్ ఇచ్చే రూ.349, రూ.399 ప్లాన్స్ ఇవే!

2

హైదరాబాద్‌ లో దీపావళి సంబరాల్లో తీవ్ర అపశ్రుతి.. పలు ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు, పలువురికి గాయాలు!

3

Aaruguru Pativratalu: డిసెంబర్ 11న థియేటర్లలోకి రానున్న ‘ఆరుగురు పతివ్రతలు’.. మరోసారి బోల్డ్ కామెడీ సందడి!

4

Chiranjeevi: మెగాస్టార్ కే ఆర్డర్ వేసిన నేటితరం సెన్సేషనల్ హీరోయిన్.. కట్ చేస్తే..!

5

Rajamouli: యాంకర్ తో రాజమౌళి ప్రేమాయణం.. వైరల్ అవుతున్న వీడియో..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Diwali Celebrations In Hyderabad Turns Tragic: దేశవ్యాప్తంగా నిన్న ఆదివారం, నవంబర్‌ 8వ తేదీన దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లలు, పెద్దలు కలిసి లక్ష్మీదేవి పూజ చేసుకుని ఫైర్ క్రాకర్స్ కాల్చారు. శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని స్మరించుకుంటూ, పూర్వకాలం నుంచే దీపావళి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. హైదరాబాద్ అంతటా దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. గచ్చిబౌలి ఐటీ కారిడార్ నుంచి నగర శివారుల వరకు పండుగ సందడి కనిపించింది. ఇంటింటా దీపాలు వెలిగించి, లక్ష్మీదేవి పూజలు నిర్వహించడంతో నగరం రంగురంగులుగా మారిపోయింది. దీపావళి అజ్ఞాన చీకట్లను తొలగించి, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ఈ ఆనందోత్సవాలు జరుపుకుంటారు.

హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు..
ఈ దీపావళి వేడుకల సమయంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కూకట్‌పల్లిలోని ఆస్బెస్టాస్ కాలనీలో పేపర్ కప్పులు, ప్లేట్ల తయారీ పరిశ్రమలో మంటలు చెలరేగి, పక్కనే ఉన్న జీఆర్టీ ఘీ, హల్దీరామ్ గోదాములకు వ్యాపించాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడటంతో అక్కడున్న ఐదు ఆటోలు, ఒక డీసీఎం దగ్ధమయ్యాయి. అదేవిధంగా కూకట్‌పల్లి, బేగంబజార్, జీడిమెట్ల, బండ్లగూడ, మైలార్‌దేవ్‌ పల్లి, కాటేదాన్ తదితర ప్రాంతాల్లోని గోదాములు, పరిశ్రమలు, దుకాణాల్లో కూడా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు కానీ ఆస్తినష్టం భారీగా వాటిల్లింది. పలువురికి గాయాలు అయ్యాయి.

ప్రధానంగా బాణసంచా నిప్పురవ్వలు పడటం వల్లే కూకట్‌పల్లి, జీడిమెట్ల, కాటేదాన్ వంటి ప్రాంతాల్లోని గోదాములు దగ్ధమయ్యాయి. వేర్వేరు ఘటనల్లో క్రాకర్స్ కాలుస్తూ దాదాపు 47 మంది గాయపడ్డారు. వారిని వెంటనే గాంధీ, ఉస్మానియా, సరోజినీదేవి కంటి ఆసుపత్రులకు తరలించారు. వారిలో 30 మందికి పైగా చికిత్స పొందారు. ఏపీలోని గుంటూరు, కర్నూలు తదితర ప్రాంతాల్లో కూడా అగ్ని ప్రమాదాలు జరిగినట్లు సమాచారం.

బేగంబజార్లో భారీ అగ్ని ప్రమాదం..
హైదరాబాద్‌లోని బేగం బజార్లో దీపావళి రోజున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బాణసంచా పడటం వల్లే మంటలు అంటుకున్నట్లు సమాచారం. క్షణాల్లోనే మంటలు భారీగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

టపాసులు కాల్చే క్రమంలో గాయపడిన 32 మందిని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి తరలించగా, వారు అక్కడ చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరుగురిని అడ్మిట్ చేయగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న నాంపల్లి ఎమ్మెల్యే మజీద్‌ హుస్సేన్ ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు.

 

Another major Fire 🔥 Accident in #Kukatpally Multiple Fire incidents [#FireAccident ] reported across #Hyderabad on Sunday kept Fire and Emergency Services on High Alert, suspects #firecrackers during #Diwali and electrical short circuits believed to have caused several blazes, including major fires in Secunderabad, Mailardevpally, Kukatpally. A major fire broke out in Paparayudu Nagar, within the Kukatpally police station limits. Reportedly Fire broke out at Haldiram's warehouse, GRB Ghee Storage, a plastic plate and paper cup manufacturing units, and a scrap warehouse. Reportedly fire broke out at a paper tea cup and plate manufacturing unit, and the flames quickly spread to GRB Ghee storage unit and Haldiram's warehouse. Police suspect the fire may have been caused by firecrackers or short circuit. As the fire spread rapidly, several nearby units also caught fire. Several vehicles were completely gutted in the fire. Fire Engines, HYDRAA, and police have reached the spot and are trying to control the blaze with 5 fire engines. Rescue operation is underway, one person injured, shifted to hospital.

— Surya Reddy (@jsuryareddy) November 9, 2026

 

బుర్జ్ ఖలీఫాపై దీపావళి వెలుగులు..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా దీపావళి కాంతులతో వెలిగిపోయింది. యూఏఈలోని ఇండియన్ కమ్యూనిటీ ఈ పండుగను ఘనంగా జరుపుకున్నాయి. "ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపాలి, సంతోషాన్ని తేవాలి, క్షేమంగా ఉండాలి" అంటూ ఇంగ్లీష్, హిందీ భాషల్లో శుభాకాంక్షలను టవర్‌పై ప్రదర్శించారు. దీంతో అక్కడున్న భారతీయులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఒక ప్రత్యేక వీడియో ద్వారా దేశ ప్రజలకు కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Festivals
Telugu News
Telangana News