• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Chiranjeevi: మెగాస్టార్ కే ఆర్డర్ వేసిన నేటితరం సెన్సేషనల్ హీరోయిన్.. కట్ చేస్తే..!

Chiranjeevi: మెగాస్టార్ కే ఆర్డర్ వేసిన నేటితరం సెన్సేషనల్ హీరోయిన్.. కట్ చేస్తే..!

Chiranjeevi Throwback: ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి, నేడు గిన్నిస్ బుక్ లో కూడా స్థానం సంపాదించుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి ఎంతో సౌమ్యుడు అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా తనతో పని చేసే వారందరితో కూడా సఖ్యతగా మెలుగుతూ చిన్న , పెద్ద, పేద, దనిక అనే తేడా లేకుండా అందరినీ ఒకే రకంగా చూస్తూ ఎంతోమంది హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు. నేడు వేలకోట్లకు అధిపతి అయిన చిరంజీవి ఏ రోజు కూడా ఆ దాహతూ చూపించలేదనడంలో సందేహం లేదు. అయితే ఇలాంటి మెగాస్టార్ కే మహానటి ఆర్డర్ వేసిందట..మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.

Written ByVishnu Priya
Published: Nov 08, 2026, 10:23 PM IST|Updated: Nov 08, 2026, 10:26 PM IST
joinshare
Chiranjeevi: మెగాస్టార్ కే ఆర్డర్ వేసిన నేటితరం సెన్సేషనల్ హీరోయిన్.. కట్ చేస్తే..!

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Aaruguru Pativratalu: డిసెంబర్ 11న థియేటర్లలోకి రానున్న ‘ఆరుగురు పతివ్రతలు’.. మరోసారి బోల్డ్ కామెడీ సందడి!

Aaruguru Pativratalu: డిసెంబర్ 11న థియేటర్లలోకి రానున్న ‘ఆరుగురు పతివ్రతలు’.. మరోసారి బోల్డ్ కామెడీ సందడి!

2

Chiranjeevi: మెగాస్టార్ కే ఆర్డర్ వేసిన నేటితరం సెన్సేషనల్ హీరోయిన్.. కట్ చేస్తే..!

3

Rajamouli: యాంకర్ తో రాజమౌళి ప్రేమాయణం.. వైరల్ అవుతున్న వీడియో..

4

Chapathi: చలికాలంలో రోటీలు గట్టిగా మారుతున్నాయా? ఇవి పాటిస్తే రోజంతా మృదువుగా ఉంటాయి

5

Samantha: పెళ్లి తర్వాత సమంత డైట్ సీక్రెట్స్..హెల్తీ లైఫ్ కోసం 7 సింపుల్ టిప్స్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Chiranjeevi - Keerthy Suresh: మెగాస్టార్ చిరంజీవి.. ఈయన పేరుకు ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా చిరు స్టెప్ వేస్తే పిల్లవాడి నుండి పండు ముసలి వరకు అందరిలో ఊపు వచ్చేస్తుంది. ఆ స్టెప్స్ ఆయనకు ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం కల్పించాయి. ఇటీవల భారతదేశం అత్యంత పౌర పురస్కారంగా భావించే పద్మ విభూషణ్ తో పాటు అక్కినేని జాతీయ అవార్డును కూడా అక్టోబర్ 28వ తేదీన అందుకోబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి.

ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ కి సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉండగా భోళాశంకర్ సినిమా షూటింగ్ సమయంలో మహానటి అలియాస్ కీర్తి సురేష్ చిరంజీవితో ఎలా ఉండేది అనే విషయాలను గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు చిరంజీవి. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ మళ్లీ వైరల్ గా మారింది.

మహానటి కీర్తి సురేష్ , మెగాస్టార్ చిరంజీవి , తమన్నా కలిసి నటించిన చిత్రం భోళా శంకర్ . ఇందులో మెగాస్టార్ కి చెల్లి పాత్రలో తన అద్భుతమైన నటనతో అందరిని మెప్పించింది కీర్తి సురేష్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి,  కీర్తి సురేష్ సెట్ లో జరిగిన విషయాలను చెప్పుకొచ్చారు.


చిరంజీవి మాట్లాడుతూ.. సినిమా షూటింగ్లో మా ఇంటి ఫుడ్ పెట్టలేదు కానీ తమన్నా పాపం ఏం అడిగేది కాదు.  కానీ కీర్తి సురేష్ హైదరాబాదులో నాకు ఫుడ్ నచ్చట్లేదు అని చెప్పింది. దాంతో నేను అడగొచ్చు కదా.. అడిగితే మేం పంపిస్తాం కదా అని అన్నాను. దానికి కీర్తి సురేష్ అదే చూస్తున్నాను అని అన్నది. దీంతో అమ్మాయి కోసం రకరకాల వంటలు వండి తీసుకొచ్చే వాళ్ళం. అయితే అవన్నీ తిన్న తర్వాత చాలా బాగున్నాయి అని చెప్పి చివర్లో కొంచెం తగ్గింది అది సరిచేసి మళ్లీ పంపించండి అని అడిగేది.


ఇదేమైనా హోటల్ అనుకుంటుందా.. కరెక్ట్ గా లేదని ప్రతిసారి డిమాండ్ చేస్తూ అది కావాలి ఇది కావాలి అని ఆర్డర్ కూడా చేసేది అంటూ సరదాగా షూటింగ్ సెట్ లో జరిగిన సంభాషణలను చిరంజీవి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా చాలా వైరల్ గా మారుతోంది.

Read More: Vivek Oberoi: రామాయణం రెమ్యునరేషన్ రూ. 6 కోట్లు విరాళం.. నిజ జీవితంలో రియల్ హీరో అనిపించుకున్న వివేక్ ఒబెరాయ్!

 

Read More:పండక్కి ‘కాకా’వెనక్కి తగ్గేదే లే.. మెగాధీమా అదేనా..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie