Hyderabad: హైదరాబాద్‌లో అమానుషం.. ఐదేళ్ల కొడుకును కడతేర్చిన కసాయి తండ్రి.. అసలేం జరిగిందంటే..?
Father killed his son in Borabanda: తెల్లవారుజామున బాలుడి తల్లి ఇంటికి వచ్చి చూడగా అప్పటికే ఐదేళ్ల కుమారుడు విజయ్ అపస్మారక స్థితిలోకి వెళ్లి విగత జీవిగా మారిపోయాడు. ఈ ఘటన బోరబండలో తీవ్ర విషాదకరంగా మారింది.
Drunken man killed his five years son in Hyderabad: సమాజంలో కొంత మంది తల్లిదండ్రులు తమ కడుపులో పుట్టిన పిల్లల్ని సైతం పొట్టన పెట్టుకుంటున్నారు. పిల్లలు లేక కొంత మంది గుళ్లు, గోపురాల చోట్లు తిరుగుతుంటే, మరికొంత మంది ఆస్పత్రుల చుట్టు తిరుగుతున్నారు. కానీ కొంత మంది మాత్రం భార్యభర్తలు గొడవలు పడి కోపంతో తమ ప్రతాపం పిల్లల మీద చూపిస్తున్నారు. మద్య మత్తులో సైతం దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని బోరబండలో పెను విషాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్ లోని బోరబండలో శిల్పినగర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. శిల్పినగర్ లో దుర్గ, విద్యాసాగర్ దంపతులు ఉంటున్నారు. తల్లి దుర్గ క్యాటరింగ్ పనులు చేస్తుండగా, విద్యాసాగర్ ఇతర పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో విద్యాసాగర్ కు తాగుడు అలవాటు అయి ప్రతిరోజు మద్యం మత్తులో గొడవలు పడేవారు.
ప్రతిరోజు మద్యం మత్తులో భార్య, పిల్లలపై దాడులుచేసేవాడు. ఈ నేపథ్యంలో ఇటీవల విద్యాసాగర్ మద్యం మత్తులో రాత్రిపూట విజయ్ గొంతు నులిమి హత్య చేశాడు. దుర్గ ఉదయం వచ్చి చూసే వరకు కొడుకు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో తల్లి కొడుకును పట్టుకుని గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు.
ఆ తర్వాత బాలుడ్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. స్థానికుల సమాచారంలో పోలీసులు ఘటన ప్రదేశంకు చేరుకున్నారు. అప్పటికే బాలుడి తండ్రి విద్యాసాగర్ పరారయ్యాడు. బాలుడి మెడపై ఎర్రగా మారిపోయి ఉండటంను వైద్యులు గుర్తించారు. పోస్టు మార్టం కోసం డెడ్ బాడీని తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.