• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /Gurnoor Brar: టీమ్ ఇండియా పేసర్ ప్రైవేట్ ఫొటోలు లీక్..? నెట్టింట స్క్రీన్‌షాట్స్ వైరల్..!

Gurnoor Brar: టీమ్ ఇండియా పేసర్ ప్రైవేట్ ఫొటోలు లీక్..? నెట్టింట స్క్రీన్‌షాట్స్ వైరల్..!

Gurnoor Brar Private Chat: టీమిండియా ఫాస్ట్ బౌలర్ గర్నూర్ బ్రార్‌కు సంబంధించినవిగా చెబుతున్న ప్రైవేట్ చాట్ స్క్రీన్‌షాట్లు, ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ చాటింగ్స్ అసలైనవేనా..? క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైన ఈ వ్యవహారం వెనుక అసలు నిజమేంటి..? వివరాలు ఇలా..

Written ByAshok Krindinti
Published: Nov 02, 2026, 01:56 PM IST|Updated: Nov 02, 2026, 01:57 PM IST
joinshare
Gurnoor Brar: టీమ్ ఇండియా పేసర్ ప్రైవేట్ ఫొటోలు లీక్..? నెట్టింట స్క్రీన్‌షాట్స్ వైరల్..!

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
School Holiday: ముంచుకొస్తున్న మురసు తుఫాను.. ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

School Holiday: ముంచుకొస్తున్న మురసు తుఫాను.. ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

2

Rajgopal Reddy: కాంగ్రెస్‌లో మంచితనాన్ని కూడా ఓర్చుకోలేరు.. సీఎం రేవంత్ పై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

3

Gurnoor Brar: టీమ్ ఇండియా పేసర్ ప్రైవేట్ ఫొటోలు లీక్..? నెట్టింట స్క్రీన్‌షాట్స్ వైరల్..!

4

Jailer 2 Movie Collection: రూ.800 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన 'జైలర్ 2' మూవీ..సినీ చరిత్రలో రజనీకాంత్ సరికొత్త రికార్డు!

5

Dhana trayodashi: ధనత్రయోదశి వేళ మరో అద్భుతం.. ఈ రాశులకు గోల్డెన్ డేస్‌తో పాటు సొంతింటి కల సాకారం.!.

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gurnoor Brar Private Chat: టీమ్ ఇండియా యంగ్ పేస్ బౌలర్ గుర్నూర్ బ్రార్ వివాదంలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమవతున్న నేపథ్యంలో సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బ్రార్‌కు సంబంధించిన కొన్ని ప్రైవేట్ చాట్ స్క్రీన్‌షాట్లు, సెల్ఫీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్నాప్‌చాట్ వేదికగా గుర్నూర్ బ్రార్ పేరుతో ఉన్న అకౌంట్ నుంచి యువతులతో జరిగిన చాట్స్, షర్ట్‌లెస్ మిర్రర్ సెల్ఫీ ఫొటోలు అంటూ నెటిజన్లు స్క్రీన్‌షాట్లను షేర్ చేస్తున్నారు. ఆ ఫొటోల్లో ఉన్న వ్యక్తి ధరించిన మెడలోని చైన్‌ను.. గుర్నూర్ పాత ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలతో పోలుస్తూ కొందరు ఇది అతనేనని అంటున్నారు. అయితే ఇవి అసలైనవేనా లేక డీప్‌ఫేక్ లేా ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసినవా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రస్తుతానికి ఈ వైరల్ న్యూస్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. ఇది గుర్నూర్ అధికారిక ఖాతా నుంచే వచ్చిందా లేక ఫేక్ ప్రొఫైల్ సృష్టించి చేసిన కుట్రనా అనే విషయం తేలాల్సి ఉంది. అటు గుర్నూర్ బ్రార్ గానీ. ఆయన తరఫు పీఆర్ బృందం గానీ.. బీసీసీఐ గానీ ఈ వివాదంపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. పూర్తి ఆధారాలు లేకుండా కేవలం సోషల్ మీడియా పోస్టులను బట్టి ఒక క్రికెటర్ వ్యక్తిగత జీవితంపై నిర్ణయానికి రావడం సరైంది కాదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

గుర్నూర్ బ్రార్ క్రికెట్ కెరీర్ విషయానికి..  ప్రస్తుతం టీమ్ ఇండియా తన స్థానాన్ని పదిలం చేసుకునే పనిలో ఉన్నారు. ఈ ఏడాది జూన్ 13న ధర్మశాలలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు భారత్ తరఫున తొమ్మిది వన్డేలకు ప్రాతినిధ్యం వహించి.. మొత్తం 14 వికెట్లు సాధించాడు. తన తొలి వన్డేలోనే 27 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ తరఫున ఆడుతున్న ఈ కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్.. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పేస్ బౌలింగ్‌తోపాటు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉంది.

అప్పుడే నిర్ధారణకు రావొద్దు..

ఒక యువ క్రికెటర్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలంటే ఎంతో కష్టపడాలి. అది మన దేశంలో అయితే ఎంతో పోటీని తట్టుకుని జాతీయ జట్టుకు ఎంపిక అవ్వడం అంత ఈజీ కాదు. జాతీయ జట్టుకు ఎంపికైనా.. ప్రతి మ్యాచ్‌లోనూ తమ టాలెంట్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గర్నూర్ బ్రార్ కూడా తన బౌలింగ్‌తో భారత జట్టులో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో ఇలాంటి ప్రచారం జరగడం నిజంగా దురదృష్టకరం. కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆధారంగా చేసుకుని గుర్నూర్ బ్రార్‌పై ఆరోపణలు చేయడం సమంజసం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంపై అతడి నుంచి లేదా సంబంధిత వర్గాల నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తేనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. 

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket
Sports News
Telugu News