SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Water Warrior: కొత్తగా వచ్చిన 'పానీ యాప్‌'లో హైదరాబాద్‌ ప్రజలు ఏం చేయాలి?

How To Join Water Warrior With PAANI App In Hyderabad: వర్షాలు లేకపోవడంతో జలాశయాలు వెలవెలపోతున్న వేళ హైదరాబాద్‌ నగరానికి తాగునీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో నీటి ఎద్దడి నివారణకు జలమండలి కొత్త యాప్‌ తీసుకువచ్చింది. పానీ యాప్‌ పేరిట తీసుకువచ్చిన యాప్‌ పనితనం ఎలానో తెలుసుకుందాం.

Written By Ravi Kumar Sargam
Published: Oct 30, 2026, 01:30 PM IST | Updated: Oct 30, 2026, 01:37 PM IST
Image Credit: PAANI App Water Warrior
Join

PAANI App Registration: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక హైదరాబాద్‌ ప్రజలకు తాగునీటి ఎద్దడి నెలకొంది. ఈ నేపథ్యంలో జలమండలి ఒక కొత్త యాప్‌ తీసుకువచ్చింది. తాగునీటి ఎద్దడి నివారణ.. నీటి వృథా అరికట్టడంతోపాటు నీటి పొదుపు చర్యలపై కొత్త కార్యక్రమాన్ని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ చేపట్టింది. అందులో భాగంగా తీసుకువచ్చిన పానీ యాప్‌ ఎలా పనిచేస్తుంది? ఆ యాప్‌తో హైదరాబాద్‌ ప్రజలు ఏం చేయాలనే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నీటి సంరక్షణ – ప్రతి పౌరుడి బాధ్యత
నీరు మనందరి ఉమ్మడి సంపద. ప్రతి నీటి బొట్టును సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.
రాబోయే ఎల్‌-నినో పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి లభ్యతపై సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఈ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది.
ప్రతి కుటుంబం నేటి నుంచే తమ నీటి వినియోగాన్ని కనీసం 20 శాతం తగ్గించుకోవాలి.

ప్రజల భాగస్వామ్యంతో నీటి సంరక్షణ
తాగునీటి వృథా, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జలమండలి ప్రత్యేకంగా PAANI మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకొస్తోంది.
ప్రజలను నీటి సంరక్షణ ఉద్యమంలో భాగస్వాములను చేయడమే ఈ యాప్ ప్రధాన లక్ష్యం.
తమ పరిసరాల్లో నీటి వృథా, దుర్వినియోగాన్ని గుర్తించి అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది.

సేవ్ వాటర్ వాలంటీర్ల నమోదు
నీటి సంరక్షణపై ఆసక్తి ఉన్న ప్రతి పౌరుడు Save Water Volunteer గా నమోదు చేసుకోవచ్చు.
ప్రభుత్వ గుర్తింపు పొందిన గుర్తింపు పత్రంతో జలమండలి వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి.
వివరాల పరిశీలన అనంతరం వాలంటీర్‌గా గుర్తింపు లభిస్తుంది.
గూగుల్ ప్లే స్టోర్ నుంచి PAANI యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని నీటి దుర్వినియోగంపై ఫిర్యాదులు చేయవచ్చు.
వాలంటీర్ నమోదు లింక్: HMWSSB Save Water Volunteer Registration

ఫిర్యాదుల పరిశీలన- చర్యలు
ప్రతి ఫిర్యాదుపై ఎస్‌ఎంఎస్‌ ఆధారిత ధ్రువీకరణ ఉంటుంది.
ఫిర్యాదు చేసిన వాలంటీర్ వివరాలను గోప్యంగా ఉంచుతారు.
అందిన ఫిర్యాదులపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహిస్తారు.
నీటి దుర్వినియోగం నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తులు లేదా సంస్థలకు నోటీసులు జారీ చేసి, నిబంధనల ప్రకారం జరిమానాలు విధిస్తారు.
బాధ్యతాయుతమైన ఫిర్యాదులను ప్రోత్సహిస్తూ, పారదర్శకంగా చర్యలు తీసుకుంటారు.

ఉత్తమ వాలంటీర్లకు ప్రత్యేక గుర్తింపు
నీటి సంరక్షణలో విశేషంగా కృషి చేసే వాలంటీర్లను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహిస్తుంది.
ఉత్తమ సేవ్ వాటర్ వాలంటీర్లతో గౌరవ ముఖ్యమంత్రి స్వయంగా సమావేశమై అభినందిస్తారు.
ప్రతి కాలనీ, ప్రతి అపార్ట్‌మెంట్, ప్రతి నివాస సముదాయం నుంచి వాలంటీర్లు ముందుకురావాలి.

తాగునీటి దుర్వినియోగానికి అడ్డుకట్ట
తాగునీటిని ప్రధానంగా తాగడానికి, ఇతర అత్యవసర గృహ అవసరాలకు మాత్రమే వినియోగించాలి.
తాగునీటితో వాహనాలు, ఫ్లోర్లు కడగడాన్ని నివారించాలి.
ఓవర్‌హెడ్ ట్యాంకులు, సంపుల నుంచి నీరు పొంగిపొర్లకుండా చర్యలు తీసుకోవాలి.
ప్రతి ఇంట్లో నీటి లీకేజీలను వెంటనే అరికట్టాలి.
ప్రతి ఇంట్లో, ప్రతి భవనంలో ఇంకుడుగుంతలు, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి.

డయల్ - ఏ- గ్రీన్ టాంకర్ సేవలు
పార్కులు, ఉద్యానవనాలు, ల్యాండ్‌స్కేపింగ్ వంటి తాగునీరు అవసరం లేని పనులకు STPల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించాలి.
నిర్మాణ రంగం, పారిశ్రామిక అవసరాలకు శుద్ధి నీటిని వినియోగించాలి     
తాగునీటిపై ఒత్తిడిని తగ్గించడానికి ప్రత్యామ్నాయ నీటి వనరులను సమర్థంగా ఉపయోగించుకోవాలి.
నీటి సంరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. ప్రజల భాగస్వామ్యంతోనే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయి.
ప్రతి కుటుంబం, ప్రతి కాలనీ నీటి పొదుపులో ఆదర్శంగా నిలవాలి.
ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే నీటి ఎద్దడి పరిస్థితులను ఎదుర్కోవడానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలి.

నీటిని పొదుపు చేయడం అంటే మన భవిష్యత్తును కాపాడుకోవడమే. నీటి వృథాను అరికట్టడానికి ప్రతి పౌరుడు ఒక వాటర్ వారియర్‌గా మారాలి. ప్రతి ఇంట్లో 20 శాతం నీటిని ఆదా చేస్తే నగరవ్యాప్తంగా ఎంతో విలువైన నీటిని సంరక్షించుకోవచ్చు. నీటి సంరక్షణను ప్రభుత్వ కార్యక్రమంగా మాత్రమే కాకుండా ప్రజా ఉద్యమంగా మార్చుదాం. నేటి నీటి పొదుపే రేపటి నీటి భద్రత.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES