• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /విశ్వక్‌ సేన్ ‘కల్ట్’ మూవీ మెప్పించిందా..

విశ్వక్‌ సేన్ ‘కల్ట్’ మూవీ మెప్పించిందా..

Cult Movie Review: గత కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీ హీరోలు ఎవరో వస్తారని ఏదో చేస్తారని కాకుండా తమ సినిమ కథలను తామే రెడీ చేసుకోవడమే కాకుండా అవసరమైతే మెగాఫోన్ పట్టుకుంటున్నారు. ఈ కోవలో తెలుగులో ‘ఫలక్‌నుమా దాస్’, మాస్ కా దాస్’ చిత్రాలతో హీరోగా దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా మరోసారి మెగాఫోన్ పట్టుకొని ‘కల్ట్’ మూవీతో పకలరించాడు. ఈ మూవీ విశ్వక్‌కు హిట్ అందించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 30, 2026, 04:21 PM IST|Updated: Oct 30, 2026, 05:10 PM IST
joinshare
విశ్వక్‌ సేన్ ‘కల్ట్’ మూవీ మెప్పించిందా..
Image Credit: Cult movie Review (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
రూ.69,999తో Infinix GT 50 Pro లాంచ్.. 24 వేల విలువైన గేమింగ్ యాక్సెసరీస్ ఫ్రీగా!

రూ.69,999తో Infinix GT 50 Pro లాంచ్.. 24 వేల విలువైన గేమింగ్ యాక్సెసరీస్ ఫ్రీగా!

2

AP Inter Exam Fee Deadline: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్..పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు గడుపు పెంపు! ఎప్పటి వరకు?

3

Hyderabad: రాబోయే 8 నెలలు హైదరాబాద్‌లో నీటి సంక్షోభం.. నగర వాసులకు జలమండలి కీలక హెచ్చరిక..

4

IND vs NZ Highlights: భారత్‌ గెలుపు యాత్రకు బ్రేక్‌.. భారీ విజయంతో పరువు నిలబెట్టుకున్న న్యూజిలాండ్‌

5

రైతు చొక్కాలోకి దూరిన నాగుపాము పిల్ల.. వీడియో ఇదే..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Cult Telugu Movie Review: మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం ‘కల్ట్’. సరికొత్త కథాంశంతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ రోజు విడుదలైన ఈ సినిమాతో విశ్వక్‌సేన్ హిట్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.

కథ విషయానికొస్తే.. 
గోవాలో ఓ మారుమూల ప్రాంతంలో జరిగే పార్టీకి వెళ్లిన యవతీ యువకులు అనుకోకుండా ఓ ప్రమాదం ఎదురువుతుంది. కొంత మంది ఆగంతకులు వాళ్లను లక్ష్యంగా చేసుకుంటారు. ప్రాణాలతో బయటపడాలంటే డేంజరస్ గేమ్ ఆడాల్సిన పరిస్థితి కల్పిస్తారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ శంకర్ నాయక్ (విశ్వక్‌సేన్) అక్కడ వరుసగా జరుగుతున్న హత్యల వెనక రహస్యాన్ని ఛేదించేందుకు ట్రై చేస్తాడు. అసలు ఈ దారుణాల వెనక ఉన్న ఉన్నదెవరు..?  అక్కడ చిక్కుకున్నవారు ప్రాణాలతో ఎలా బయటపడ్డారు. చివరకు ఏం జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ.  

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ మల్టీ టాలెంటెడ్. తన సినిమాలకు సంబంధించిన కథలతో పాటు అన్నింట్లో ఇన్వాల్వ్ అయి బెటర్ ఔట్ పుట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కోవలో ఈయన దర్శకుడిగా గోవాలో ఓపెన్ చేశాడు. అక్కడ నుంచి ఒక్కసారిగా పూర్తిగా వాతావరణం మారిపోతుంది. కొంత మంది ఆగంతకులు యువతీ యువకులను కిడ్నాప్ చేసి వారితో ప్రాణాంతకమైన ఆటలను ఆడిస్తుంటారు. అంతేకాదు అక్కడున్న వారు ఒక్కొక్కరుగా హత్యకు గురవుతుంటారు. ఈ మిస్టరీని ఛేదించే పోలీస్ ఆఫీసర్‌గా శంకర్ నాయక్‌గా కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు.  అయితే స్టార్టింగ్‌లో చూపించిన ఎమోషన్ ఆ తర్వాత మిస్ అయింది. కథలో కీలక మలుపులు పెద్దగా ఆకట్టుకునేలా లేకపోవడం మైనస్. కథ బాగానే ఉన్న దాన్ని తెరకెక్కించడంలో అక్కడక్కడా తడబడ్డాడు. అసలు కథ ఎటు వెళుతుందో సందేహాన్ని కలిగిస్తాయి.

అయితే విశ్వక్ సేన్ ప్రయత్నం కొత్తది అయినా.. దాన్ని ప్రేక్షకులు అరటి పండు ఒలిచేలా చెప్పడంలో తడబడ్డాడు. ముఖ్యంగా కథనం కంటే హింసాత్మక దృష్యాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు అయింది. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు విశ్వక్ తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. సాంకేతికంగా బాగున్నా.. ఎమోషన్  పూర్తి స్థాయిలో కనెక్ట్ కాలేదు. రవి బస్రూర్ సంగీతం ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్.

నటీనటుల విషయానికొస్తే..

విశ్వక్ సేన్ తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. తన మార్క్ హీరోయిజంతో పాటు యాక్షన్ సీన్స్ ‌లో అలరించాడు. గాయత్రి భరద్వాజ్ పర్వాలేదు. తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యర్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

పంచ్ లైన్ .. ‘కల్ట్’ విశ్వక్ సేన్ మార్క్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్

రేటింగ్: 3/5
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Movie Review
OTT Movies
Telugu News