హైదరాబాద్‌వాసులకు జలమండలి హెచ్చరిక! వాటర్ బిల్లుల పేరుతో నకిలీ మెసేజ్‌లు.. లింక్ ఓపెన్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ!
సైబర్ మోసగాళ్లు ఇప్పుడు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. ఇప్పటివరకు బ్యాంక్ అలర్ట్లతో సందేశాలు పంపేవారు, కానీ ప్రస్తుతం జలమండలి పేరుతో నకిలీ మెసేజ్లు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో, జలమండలి కీలక హెచ్చరిక జారీ చేస్తూ, ప్రజలు ఇలాంటి మెసేజ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆ లింక్‌లను క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రోజురోజుకూ సైబర్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. వీటిలో చదువుకున్న వారు కూడా ఈ వలలో చిక్కుకుంటున్నారు. ఇప్పటివరకు బ్యాంక్ ఖాతా ఓటీపీల ద్వారా మోసాలు జరుగుతుండగా, తాజాగా జలమండలి పేరుతో నకిలీ మెసేజ్‌లు పంపుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ జలమండలి ప్రజలకు కీలక అలర్ట్ జారీ చేసింది. ప్రధానంగా మీరు బిల్లు చెల్లించలేదని లేదా మీటర్ రీడింగ్ అప్‌డేట్ కాలేదని ఎస్ఎంఎస్ రూపంలో పంపుతున్నారు. అయితే, ఆ లింక్‌ను వెంటనే క్లిక్ చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుందని హెచ్చరిస్తోంది జలమండలి. లేకపోతే నల్లా కనెక్షన్ తొలగిస్తామంటూ వచ్చే ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ సందేశాలను నమ్మవద్దని, ఇటువంటి మెసేజ్‌లను జలమండలి పంపదని స్పష్టం చేసింది.
ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు హైదరాబాద్ వాసులకు ఈ విధంగా హెచ్చరించింది. అంతేకాదు, గుర్తుతెలియని నంబర్లను సంప్రదించవద్దని, వాట్సాప్‌లో వచ్చే ఏపీకే ఫైల్స్‌ను పొరపాటున కూడా డౌన్‌లోడ్ చేయవద్దని హెచ్చరిస్తోంది. అనధికారిక యాప్‌లను డౌన్‌లోడ్ లేదా ఇన్‌స్టాల్ చేయవద్దని ఇప్పటికే పలుమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ, ప్రజలు సైబర్ మోసాలకు గురవుతున్నారు. తాజాగా ప్రభుత్వ జలమండలి పేరుతో వాట్సాప్ మెసేజ్‌లు పంపుతుండటంతో ప్రజలు నమ్మి మోసపోయే అవకాశం ఉంది. అందుకే హైదరాబాద్ మెట్రోపాలిటన్ బోర్డు ఈ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంక్ ఖాతా వివరాలు లేదా డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దని, అనుమానాస్పద యూపీఐ నంబర్లు లేదా క్యూఆర్ కోడ్‌ల ద్వారా డబ్బులు చెల్లించవద్దని సూచించింది.
జలమండలి పేరు, లోగోతో వచ్చే సందేశాల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు హెచ్చరించింది. బిల్లులు లేదా సేవలపై ఏవైనా సందేహాలు ఉంటే కేవలం అధికారిక కస్టమర్ కేర్ నంబర్ 155313 ద్వారా మాత్రమే సంప్రదించాలని, వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే సందేశాలను నమ్మవద్దని కోరింది.
కాబట్టి, హైదరాబాద్ వాసులు ఈ సైబర్ మోసానికి గురికాకుండా జాగ్రత్త వహించడం మంచిది. జలమండలి పేరుతో నకిలీ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఒకవేళ పొరపాటున ఇటువంటి మెసేజ్‌లను క్లిక్ చేసినా లేదా ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసినా బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. మోసాలకు గురికాకుండా ఉండాలంటే కేవలం అధికారిక వెబ్‌సైట్లు, ఫోన్ నంబర్లను మాత్రమే సంప్రదించాలి.