Pawan Kalyan: హైదరాబాద్‌లో కలకలం.. పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద అభిమాని ఆత్మహత్యాయత్నం.!.
Pawan kalyan Fan suicide attempt in hyderabad: జూబ్లిహిల్స్ లోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద అభిమాని కత్తి పట్టుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో సెక్యురిటీ సిబ్బంది రంగంలోకి దిగి అతడ్ని అడ్డుకున్నారు.
Fan suicide attempt near deputy cm pawan kalyan residence: హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది. ఒక బిల్డర్ కత్తిపట్టుకుని హల్ చల్ చేశారు. తాను పవన్ కళ్యాణ్ అభిమానినని ఆయనను కలవాలని నానా రచ్చ చేశాడు. అప్పుల బాధతో ఉన్నానని దయచేసి తనను ఆదుకొవాలంటూ ఫ్లెక్సీలో రాసుకొచ్చాడు. వెంటనే సెక్యురిటీ సిబ్బంది బిల్డర్ సుచేతన్ ను అడ్డుకున్నారు.
పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడకు చేరుకుని బిల్డర్ ను అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి ఖమ్మం జిల్లా బల్లేపల్లికి చెందిన బట్టు సుచేతన్ ఠాకూర్ నాయక్ గా గుర్తించారు.
అప్పుల ఊబిలో కూరుకుపోయానని దయచేసి పవన్ కళ్యాణ్ తనకు ఆర్థిక సాయం అందించాలని కోరుతూ ఫ్లెక్సీతో నిరసనలకు దిగాడు. ఆదుకొకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఫ్లెక్సీతో రచ్చ చేశాడు. ఈ క్రమంలో పోలీసులు సెక్యురిటీ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుమేరకు బిల్డర్ సుచేతన్ ను అరెస్ట్ చేసి జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనతో జూబ్లిహిల్స్ లో కొంత సేపు టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు రాజకీయ కుట్ర కోణం ఏమైన ఉందా అనే యాంగిల్ లో సైతం విచారణ చేపట్టారు.