Hyderabad: హైదరాబాద్‌లోని ఓఆర్ఆర్ వద్ద ఢీ కొన్న నాలుగు కార్లు.. భారీగా ట్రాఫిక్ జామ్.!.
Hyderabad orr road accident: శంషాబాద్ కు వెళ్లే మార్గంలో ఒక కారు హెచ్ఎండీఎ బ్లాస్టింగ్ పనుల వల్ల నెమ్మదిగా వెళ్తుంది. ఇంతలో కారును వెనుక నుంచి వచ్చిన ఇతర వాహనాలు వరుసగా ఢీకొన్నాయి.
Road Accident near orr hyderabad: హైదరాబాద్ లో ఇటీవల తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను జాగ్రత్తగా నడిపించాలని చెప్పిన కూడా కొంత మంది నెగ్లీజెన్సీ వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్డులో ఇటీవల ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల హెచ్ఎండీఏ అధికారులు రోడ్డు మరమ్మత్తులు చేసి మరల వదిలివేయడం వల్ల గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా.. అవుటర్ రింగ్ రోడ్డు మీద నాలుగు కార్లు ఒకదారికి మరోకటి బలంగా ఢీకొన్నాయి.
హైదరాబాద్ లోని అవుటర్ రింగ్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్ కు వెళ్లే మార్గంలో నాలుగు కార్లు ప్రమాదంకు గురయ్యాయి. రాజేంద్రనగర్ పరిధిలోని హిమాయత్ సాగర్ ORR వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. HMDA బ్లాస్టింగ్ పనుల వల్ల రోడ్డుపై రాళ్లు పడటం వల్ల ఒక కారును డ్రైవర్ నెమ్మదిగా నడిపిస్తున్నాడు. ఇంతలో అదిగమనించకుండా వెనుకాల వచ్చిన మరోకారు స్పీడ్ గా వచ్చి దాన్ని ఢీకొట్టింది.
ఆ తర్వాత నిముషాల వ్యవధిలోనే మరో రెండు కార్లు వచ్చి ఒకదానికి మరోకటి ఢీకొన్నాయి. నాలుగు కార్లు ఒకదానికి మరోకటి బలంగా ఢీకొనడంతో వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెంటనే అక్కడున్న వారు పోలీసులకు, అంబులెన్స్ వారికి సమాచారం అందించారు.
కారులోని వారిని నెమ్మదిగా బైటకు తీసి అక్కడి నుంచి స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న వారికి తీవ్రంగా గాయలయ్యాయి. ఈ ఘటనతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాబ్ ఏర్పడింది. ఇద్దరి కార్లకు ఫ్రాక్చర్లు, మరో ఇద్దరికి సీరియస్గా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.