• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /అక్టోబర్ 2న నగరంలో వైన్ షాపులు, మటన్ మార్కెట్లు బంద్.. GHMC ఆదేశాలు ఇవే!

అక్టోబర్ 2న నగరంలో వైన్ షాపులు, మటన్ మార్కెట్లు బంద్.. GHMC ఆదేశాలు ఇవే!

హైదరాబాద్ నగర నివాసులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక. రాబోయే అక్టోబర్ 2వ తేదీన నగరంలోని మాంసం దుకాణాలు, వైన్ షాపులు పూర్తిగా బంద్ ఉండబోతున్నాయి. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని మాంసం, మద్యం విక్రయ కేంద్రాలను మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Sep 30, 2026, 02:09 PM IST|Updated: Sep 30, 2026, 02:22 PM IST
joinshare
అక్టోబర్ 2న నగరంలో వైన్ షాపులు, మటన్ మార్కెట్లు బంద్.. GHMC ఆదేశాలు ఇవే!
Image Credit: Hyderabad dry day October 2

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ముక్క లేనిదే ముద్ద దిగని వారికి.. చుక్క లేనిదే నిద్ర పట్టని వారికి భారీ షాక్ అని చెప్పవచ్చు. అక్టోబర్ 2వ తేదీన నగరంలో వైన్ షాపులతో పాటు మాంసం విక్రయించే దుకాణాలు కూడా మూసివేసి ఉంటాయి. అక్టోబర్ 2వ తేదీన జరుపుకునే మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ రెండు రకాల షాపులను బంద్ చేయాలని నిర్ణయించారు. గొర్రెలు, మేకలు పశువుల వధ శాలలతోపాటు అన్ని రకాల మాంసం దుకాణాలను కూడా మూసివేయాలని జీహెచ్‌ఎంసీ ఆదేశాలు ఇచ్చింది. మున్సిపల్ కమిటీ తీసుకున్న ఒక ప్రత్యేక తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు విడుదలైన నేపథ్యంలో, మున్సిపల్ అధికారులు కూడా ఈ ప్రక్రియలో పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. అంతేకాకుండా, అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కూడా మాంసం,వైన్ షాపులు బంద్ అయ్యే అవకాశం ఉంది.

సాధారణంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన చికెన్ ఇతర మాంసం షాపులు సెలవులో ఉంటే, అదే రోజు మధ్యాహ్నం నుండి మద్యం దుకాణాలు కూడా బంద్ చేస్తారు. ప్రధానంగా గాంధీ జయంతి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ కీలకమైన నిర్ణయాన్ని అధికారులు తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ఆదేశాల ప్రకారం నగరంలోని చికెన్ షాపులు, మటన్ షాపులు, మద్యం విక్రయించే షాపులు అన్నీ మూసివేసి ఉండాలి. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారిక సర్క్యులర్‌ను కూడా విడుదల చేసింది.

అంతేకాకుండా, జారీ చేసిన ఈ ఆదేశాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా అమలు చేయాలని జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సూచించారు. దీనిని సమర్థవంతంగా అమలు చేయడానికి పోలీస్ కమిషనర్లను కూడా కోరారు. పోలీస్ శాఖ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ షాపులను మూసివేసేలా చూడాలని సూచించారు.

ఇటీవల జరిగిన వినాయక నిమజ్జనం సమయంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేదా గొడవలు చోటు చేసుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో వైన్ షాపులను బంద్ చేశారు. అదే విధంగా, అహింసావాది అయిన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా, అహింసకు ప్రాధాన్యత ఇచ్చే ఈ ప్రత్యేక రోజున పలు ప్రాంతాల్లో మాంసం విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయించారు. ఇది కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం కాకుండా, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా అక్టోబర్ రెండో తేదీన మద్యం షాపులతో పాటు మాంసం దుకాణాలు కూడా బంద్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం జిహెచ్ఎంసి సిపిఆర్ఓ  కార్యాలయం ద్వారా ఈ అధికారిక సర్క్యులర్ విడుదల అయింది.

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad