• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /హైదరాబాద్‌లో ఘనంగా గణేష్ శోభాయాత్ర.. అడగడున పోలీస్ నిఘా..

హైదరాబాద్‌లో ఘనంగా గణేష్ శోభాయాత్ర.. అడగడున పోలీస్ నిఘా..

Hyderabad Ganesh Nimajjanam 2026: హైదరాబాద్‌ జంట నగరాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షలాది వినాయక విగ్రహాలు వినాయక సాగర్ (ట్యాంక్ బండ్), ఇతర చెరువుల వద్దకు నిమజ్జనానికి రానున్నాయి. ఈ మహా ఘట్టం కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్, భద్రత, జనసందోహాన్ని కంట్రోల్ చేయడానికి సుమారు 25 వేల నుంచి 30 వేల మంది పోలీసులను బందోబస్తులో ఉన్నారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Sep 25, 2026, 07:50 AM IST|Updated: Sep 25, 2026, 08:03 AM IST
joinshare
హైదరాబాద్‌లో ఘనంగా గణేష్ శోభాయాత్ర.. అడగడున పోలీస్ నిఘా..
Image Credit: Vinayaka Nimajjana Eraptlu

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Hyderabad Ganesh Nimajjanam: భాగ్యనగర్ గణేష్ నిమజ్జనం సందర్బంగా ప్రధాన ఊరేగింపు  జరిగే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, జనాలను కంట్రోల్ చేయడానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో 25 వేల నుంచి 30 వేల మంది పోలీసులతో 24 గంటల పాటు గట్టి నిఘా ఏర్పాటు చేశామని డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా హైదరాబాద్ పోలీసులు టెక్నాలజీ సాయంతో నిఘాను మరింత పటిష్ఠం పెంచాపెంచారు.

10 సీసీ టీవీ కెమెరాల నిఘా.. 
భద్రతా ప్రణాళికల కోసం, ఎన్ని విగ్రహాలు వస్తున్నాయో కచ్చితంగా లెక్కించడానికి భారీగా డ్రోన్లు, 10 వేల సీసీటీవీ కెమెరాలు వాడుతున్నట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. అలాగే ట్యాంక్ బండ్  చుట్టూ ఎత్తైన భవనాల మీద సుమారు 100 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

దాదాపు 30 వేల మందితో పోలీస్‌ బందోబస్తు..
భారీ ఎత్తున జరిగే ఈ శోభాయాత్ర కోసం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలులో ఉంటాయి. చెరువుల దగ్గర క్రేన్లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ బోట్లు, గజ ఈతగాళ్లు, మెడికల్ క్యాంపులను కూడా అధికారులు సిద్ధం చేశారు. ఈ పండుగను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, ప్రశాంతంగా జరిపించేందుకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ స్పష్టం చేశాయి. శోభాయాత్ర సమయంలో ప్రజలు, ఉత్సవ కమిటీలు, భక్తులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, సూచించిన రూట్లలోనే వెళ్లాలని కోరారు.

గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం..

భక్తిశ్రద్ధలతో పూజలనంత‌రం గణనాథుడి నిమజ్జన కార్యక్రమానికి న‌గ‌ర ప్రజ‌లు సిద్ధమౌతున్నారు. ఇప్పటికే కొన్ని విగ్రహాలు నిమ‌జ్జనం పూర్తి చేయ‌గా.. ఈ రోజు అనంత పద్మనాభ చతుర్ధశి సందర్భంగా  ప్రధాన నిమజ్జన ఘ‌ట్టం ప్రారంభం కానుంది. భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా హైడ్రా ఏర్పాట్లు చేసింది. కూక‌ట్ ప‌ల్లి ఐడీఎల్ చెరువు అభివృద్ధి ప‌నులు పూర్తవ్వన‌ప్పటికీ.. గ‌ణేష్ నిమ‌జ్జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఏకంగా 25 అడుగుల మేర చెరువును త‌వ్వి నిమ‌జ్జనాలు సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేసింది హైడ్రా. ఈ ఏర్పాట్లు ఇలా ఉండ‌గా.. వినాయక ‌సాగ‌ర్‌తో పాటు నిమ‌జ్జ‌నం పెద్ద సంఖ్యలో జ‌రిగే చెరువుల‌లో హైడ్రా స్విమ్మర్లను రంగంలోకి దించింది.

హైదరాబాద్‌ జంట నగరాల గణేష్‌ నిమజ్జనాలు..
సాగ‌ర్లో మూడు షిఫ్టుల‌లో 50 మంది చొప్పున మొత్తం 150 మంది స్విమ్మర్‌లను అందుబాటులోకి తెచ్చింది. సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో మ‌రో 84 మంది స్విమ్మర్లను విధుల్లో ఉంచింది. వీరికి అద‌నంగా 51 డీఆర్ఎఫ్ బృందాలు నిమ‌గ్నమ‌య్యాయి. గ‌ణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా మిగ‌తా శాఖ‌ల‌తో క‌లిసి హైడ్రా చ‌ర్యలు తీసుకుంటోంద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ తెలిపారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telangana News
Hyderabad