• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /KBR పార్కు ప్రాజెక్టు రద్దు.. గుంతల పూడ్చివేత.. ఎలివేటెడ్ కారిడార్ పై దృష్టి..

KBR పార్కు ప్రాజెక్టు రద్దు.. గుంతల పూడ్చివేత.. ఎలివేటెడ్ కారిడార్ పై దృష్టి..

KBR Project: హైదరాబాద్‌‌‌‌‌లోని జూబ్లిహిల్స్‌లోని కేబీఆర్‌‌‌‌ పార్క్‌‌‌‌ చుట్టూ అండర్‌‌‌‌పాస్‌‌‌‌లు, స్టీల్‌‌‌‌ బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన పాత ప్రణాళిక రద్దు కావడంతో తవ్విన గుంతలను పూడ్చుతున్నారు. అగ్రసేన్‌‌‌‌ మహారాజ్‌‌‌‌ జంక్షన్‌‌‌‌ వద్ద అండర్‌‌‌‌పాస్‌‌‌‌ల కోసం తవ్విన రెండు భారీ గుంతలను ట్రాక్టర్లు, ట్రక్కుల ద్వారా మట్టిని తరలించి పూడ్చివేస్తున్నారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 05, 2026, 01:16 PM IST|Updated: Oct 05, 2026, 01:31 PM IST
joinshare
KBR పార్కు  ప్రాజెక్టు రద్దు.. గుంతల పూడ్చివేత.. ఎలివేటెడ్ కారిడార్ పై దృష్టి..
Image Credit: KBR Park (File Pics/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Father Son Property Rights: కొడుకు సంపాదన, ఆస్తిలో తల్లిదండ్రులకు హక్కు ఉంటుందా? వారసత్వ చట్టం ఏం చెబుతోంది!

Father Son Property Rights: కొడుకు సంపాదన, ఆస్తిలో తల్లిదండ్రులకు హక్కు ఉంటుందా? వారసత్వ చట్టం ఏం చెబుతోంది!

2

Actress: 26 ఏళ్లుగా తోడుగా ఉన్న మేకప్‌మెన్‌కు హీరోయిన్ సర్‌ప్రైజ్.. వీడియో వైరల్..!

3

గ్రాండ్‌గా సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ ఈవెంట్.. విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం..!

4

సీఈసీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీం విచారణ.. జ్ఞానేష్‌పై వేటుకు నిరాకరణ..

5

Nizamabad: పోలీస్ స్టేషన్‌లో నిప్పటించుకుని వ్యక్తి ఆత్మహత్యయత్నం.. నిజామాబాద్ జిల్లాలో షాకింగ్.. వీడియో..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

KBR Project Updates:  కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రభుత్వం తలపెట్టిన 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌ల ప్రతిపాదనను ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో ఈ ప్రాంతంలో వీటి నిర్మాణాల కోసం వన్ వే అమలు చేసిన ప్రభుత్వ అధికారులు.. అక్కడ ట్రాఫిక్ గణనీయంగా తగ్గడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం అమలు చేస్తోన్న వన్ వే సక్సెస్ కావడంతో ప్లాన్ బి అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పటికే కేబీఆర్ పార్క్ చుట్టు గుంతలను పూర్తిగా పూడ్చి రోడ్డుకు సమాంతరంగా ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇతర ప్రాంతాల్లో అండర్‌‌‌‌పాస్‌‌‌‌ల కోసం తవ్విన గుంతలను కూడా దశలవారీగా పూడ్చేస్తున్నారు.

4 కిలోమీటర్ల మేర 6 లేన్ల బై డైరెక్షన్‌లో  ఎలివేటెడ్‌‌‌‌ కారిడార్‌‌‌‌ నిర్మాణం..

కేబీఆర్‌‌‌‌ పార్క్‌‌‌‌ చుట్టూ ట్రాఫిక్‌‌‌‌ సమస్య పరిష్కారానికి గతంలో రూ. 1,090 కోట్ల అంచనా వ్యయంతో 7 స్టీల్‌‌‌‌ బ్రిడ్జిలు, 7 అండర్‌‌‌‌పాస్‌‌‌‌ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. అయితే పార్క్‌‌‌‌ చుట్టూ వన్‌‌‌‌వే విధానం అమలు చేయగా ట్రాఫిక్‌‌‌‌ రద్దీ తగ్గడంతో ఆ ప్రణాళికను పునఃపరిశీలించారు. దీంతో పాత ప్రతిపాదనను రద్దు చేసి ఎలివేటెడ్‌‌‌‌ కారిడార్‌‌‌‌ నిర్మాణంపై దృష్టి సారిస్తున్నారు. బంజారాహిల్స్‌‌‌‌లోని ముఫఖం జా కాలేజ్‌‌‌‌ నుంచి జూబ్లీహిల్స్‌‌‌‌ చెక్‌‌‌‌పోస్ట్‌‌‌‌ వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల బై డైరెక్షనల్‌‌‌‌ ఎలివేటెడ్‌‌‌‌ కారిడార్‌‌‌‌ నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం సుమారు రూ. 751 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


వన్‌ వేతో తగ్గిన ట్రాఫిక్‌ సమస్య..  ప్రాజెక్టులో  కీలక మార్పులు.

పాత ప్రణాళికలో ఏడు అండర్‌‌‌‌పాస్‌‌‌‌లు, ఏడు స్టీల్‌‌‌‌ బ్రిడ్జిలతో పాటు భూసేకరణకే సుమారు రూ. 1,040 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. కొత్త ప్రతిపాదనలో భూసేకరణ వ్యయం రూ.300 కోట్లలోపే ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే పార్క్‌‌‌‌ హయత్‌‌‌‌, కేబీఆర్‌‌‌‌ మెయిన్‌‌‌‌ గేట్‌‌‌‌ వద్ద నిర్మించిన పిల్లర్లను కొత్త ఎలివేటెడ్‌‌‌‌ కారిడార్‌‌‌‌లో వినియోగించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేబీఆర్ పార్క్ చుట్టే చేపట్టే పనులను GHMC కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పరిశీలించారు.  

 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telangana News
Telugu News