• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /హైదరాబాద్ వాసులకు శుభవార్త.. నగరంలో మెట్రో, ఆర్టీసీ సేవలకు ఒకే టికెట్..

హైదరాబాద్ వాసులకు శుభవార్త.. నగరంలో మెట్రో, ఆర్టీసీ సేవలకు ఒకే టికెట్..

RTC & Metro Single Ticket: హైదరాబాద్‌ నగర వాసులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ తెలిపింది. నగరంలోని సిటీ బస్సులు, మెట్రోలో ప్రయాణం మరింత సులభతరం చేసేందుకు కామన్‌ పాస్‌ విధానాన్ని తీసుకొచ్చింది. సిటీ బస్సులు, మెట్రోలలో ప్రయాణించేందుకు ప్రతీసారి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా, ఒకే పాస్‌తో ప్రయాణం చేయవచ్చు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 02, 2026, 07:31 AM IST|Updated: Oct 02, 2026, 07:37 AM IST
joinshare
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. నగరంలో మెట్రో, ఆర్టీసీ సేవలకు ఒకే టికెట్..
Image Credit: Common Metro RTC Pass (File/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
 కాక పుట్టిస్తోన్న ఖైరతాబాద్ బై పోల్.. ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాజకీయ వర్గాలు..

కాక పుట్టిస్తోన్న ఖైరతాబాద్ బై పోల్.. ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాజకీయ వర్గాలు..

2

హైదరాబాద్ వాసులకు శుభవార్త.. నగరంలో మెట్రో, ఆర్టీసీ సేవలకు ఒకే టికెట్..

3

AP DSC 2.o Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..అతిత్వరలోనే మరో డీఎస్సీ నోటిఫికేషన్..మంత్రి లోకేష్ కీలక మార్పులు!

4

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

5

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Common Road Transport Ticket: ఇక మెట్రోలలో ఫిజికల్ టికెట్ తీసుకోవాలంటే కౌంటర్ల వద్ద క్యూలైన్లలో నిల్చోవాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకోవాలన్నా రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు చాలా సమయం పడుతుంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ కామన్ పాస్‌ను తీసుకొచ్చింది. దీంతో పదే పదే టికెట్ తీసుకోవాల్సిన పని లేకుండా, వేగవంతమైన ప్రయాణం చేయవచ్చని అధికారులు తెలిపారు.

నేటి నుంచి ఆర్టీసీ, మెట్రో కామన్ పాస్.. 
ఆర్టీసీ, మెట్రో సర్వీసుల కోసం కామన్ పాస్‌ను నేటి నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. ప్రజా భవన్‌లో జరగనున్న కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీనిని లాంచ్ చేయనున్నారు. ఇందులో భాగంగా రోజువారీ, వారం రోజులు, నెలవారీ పాస్‌లను ప్రవేశ పెట్టనున్నారు. రోజువారీ పాస్ ధర 400 రూపాయలు, నెలవారీ పాస్ ధర 8500 రూపాయలుగా నిర్ణయించారు. పాస్‌తో మెట్రో, ఆర్టీసీ బస్సులు రెండింటిల్లోనూ నగర పరిధిలో ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు.

నేడు ఆర్టీసీ, మెట్రో కామన్ పాస్.. 

ఇక రోజూ ప్రతీ బస్సులో, మెట్రోలో టికెట్ తీసుకోవాల్సిన పని తప్పుతుంది. తెలంగాణ ప్రభుత్వం, టీజీఎస్‌ ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో రైల్ సంయుక్తంగా ఈ కామన్ పాస్‌ను తీసుకొచ్చాయి. నేటి నుంచే ఈ పాస్‌లను ప్రజలు కొనుగోలు చేయవచ్చు. ఈ పాస్ హైదరాబాద్ పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో లగ్జరీ, ఎలక్ట్రిక్, ఏసీ బస్సులు, మెట్రోలలో కూడా వర్తిస్తుంది.  ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు ఈ పాస్‌లు చెల్లుబాటు అవుతాయి. దీంతో శివారు ప్రాంతాల ప్రజలకు కూడా ఉపయోగపడనుంది. అయితే ముందుగా ఎంఎంటీఎస్, క్యాబ్‌లకు కూడా ఇది వర్తింపజేయాలనుకున్నారు. కానీ చివరగా ఆర్టీసీ, మెట్రోలకే పరిమితం చేశారు. 

యాప్‌లోనే పాస్‌లు తీసుకునే వీలు కల్పించిన ప్రభుత్వం..

ఆర్టీసీ టికెట్ బుకింగ్ మరింత సులువు కానుంది. యాప్‌లో టికెట్ పొందే వీలుంది. రోజువారీ టికెట్‌తో పాటు డే, వీక్లీ, నెలవారీ పాస్‌లను యాప్ ద్వారానే పొందవచ్చు. దీని ఫిజికల్ టికెట్ అవసరం ఉండదు. ఇవాళ ఈ కొత్త సిస్టమ్‌ను టీజీఎస్‌ఆర్టీసీ ప్రారంభించనుంది. ఇప్పటివరకు పాస్ తీసుకోవాలంటే ఆర్టీసీ కౌంటర్లకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పటినుంచి ఆ బాధ తప్పుతుంది. సులువుగా మొబైల్ యాప్ ద్వారానే ఆర్టీసీ పాస్‌లు పొందవచ్చు. ఇక ఉమ్మడి పాస్ వల్ల టికెట్ కష్టాలు తొలగిపోనున్నాయి. అయితే ఈ రేట్లు మరీ మాములు జనాలకు టూ మచ్‌గానే కనిపిస్తున్నాయి. రోజుకు 400 అంటే మరీ ఎక్కువగా అనే కామెంట్స్ వినపడుతున్నాయి.

Add Zee News as a Preferred Source