SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kidnap Gang: బాలికలను కిడ్నాప్‌ చేసి బలవంతంగా పడుపు వృత్తిలోకి.. అతిపెద్ద గ్యాంగ్‌ అరెస్ట్‌

Hyderabad Police Busted Girls Kidnap Gang In Tolichowki: బాలికలకు మాయమాటలు చెప్పి కిడ్నాప్‌ చేసి అనంతరం బలవంతంగా పడుపు వృత్తిలోకి దింపుతున్న గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార రాకెట్‌ నడుపుతున్న గ్యాంగ్‌ ఆగడాలను హైదరాబాద్‌ పోలీసులు అడ్డుకట్ట వేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 10, 2026, 11:31 PM IST | Updated: Oct 10, 2026, 11:34 PM IST
Image Credit: Kidnap Gang Arrest
Join

Kidnap Gang: డబ్బుల ఆశపడి పసి హృదయాలను కిడ్నాప్‌ చేసి అనంతరం వారితో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బాలికలను పడుపు వృత్తిలోకి తీసుకువస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేసి ఆ ముఠా వ్యభిచార గుట్టును రట్టు చేశారు. వారి చెరలో ఉన్న బాలికలను విడిపించారు. ఈ ముఠాలోని సభ్యులపై పోలీసులు పోక్సో, అనైతిక రవాణా నిరోధక చట్టం (ఐటీపీఏ) కేసులను నమోదు చేశారు. హైదరాబాద్‌లోని టౌలిచౌకి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌లో మైనర్ బాలికను తన ఆటోలో టోలిచౌకి నుంచి కిడ్నాప్‌ చేసి.. అనంతరం పథకం ప్రకారం అత్తాపూర్ వద్దకు తీసుకెళ్లి సనా (ఏ4), సమ్రీన్ (ఏ5) ఇద్దరు మహిళలకు అప్పగించాడు. ఆ ఇద్దరు మహిళలు బాలికకు పౌష్టికాహారం, వసతి కల్పిస్తామని నమ్మబలికి.. బలవంతంగా అత్తాపూర్‌లో వ్యభిచార గృహం నడుపుతున్న హాజీమియా భార్య సబియా బేగం (ఏ2)కు అప్పగించి రూ.30,000 తీసుకున్నారు.

మైనర్ బాలికలను ట్రాఫికింగ్ చేసి లైంగికంగా శ్రమదోపిడీ చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆహారం, వసతి కల్పిస్తామని ఆశచూపి వేర్వేరు ప్రాంతాలకు తరలించి వ్యభిచార గృహాలకు విక్రయించి డబ్బులు పంచుకున్నట్లు తేలడంతో వారి గుట్టును రట్టు చేసింది. నిందితుల పూర్తి పాత్ర మరియు ఆర్థిక లావాదేవీల వివరాలపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.   గోల్కొండ జోన్ డీసీపీ జె. రాఘవేందర్ రెడ్డి పర్యవేక్షణలో టోలిచౌకి డివిజన్ ఏసీపీ సయ్యద్ ఫియాజ్, టోలిచౌకి ఇన్‌స్పెక్టర్ ఎల్ రమేష్ నాయక్, అడిషనల్ ఇన్‌స్పెక్టర్ బాలరాజ్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఎస్. రవికుమార్, సిబ్బంది పనిచేసి 24 గంటల్లోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు.

ఆ డబ్బులను ఆతిఫ్, సనా, సమ్రీన్ పంచుకోగా.. ఆ బాలికతో సబియా బేగం బలవంతంగా వ్యభిచారం చేయించారు. బాలిక తనను విడిచిపెట్టమని వేడుకోగా ఎండీ నదీమ్ (ఏ6), ఎండీ కైఫుద్దీన్ (ఏ7), అలీ బిన్ అక్రమ్ (ఏ8)లు కస్టమర్లను తీసుకురావడం, లైంగిక వృత్తిలో ఉన్నవారికి వసతులు కల్పించడంలో సహకరించేవారు. వారి బారి నుంచి బాలిక ఆ వ్యభిచార గృహం నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. కుటుంబసభ్యులకు జరిగిన దారుణాన్ని వివరించడంతో వారు టోలిచౌకి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి 6 మొబైల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించిన ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించి, నేరానికి పాల్పడిన 8 మంది నిందితులను 24 గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES