SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

సదర్ సంబరాలకు భాగ్యనగరం ముస్తాబు.. కేరళ బాహుబలి దున్నపోతుతో రచ్చ.. పూర్తి వివరాలు!

సదర్ సంబరాలకు హైదరాబాద్ ముస్తాబైంది. వారం రోజుల పాటు గల్లీ గల్లీలో సదర్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ సంబరాలలో భాగంగా హైదరాబాద్‌లో కేరళ బాహుబలి దున్నలు సందడి చేస్తున్నాయి. ప్రత్యేక ఆకర్షణగా లడ్డు యాదవ్ బజరంగ్ దున్న నిలుస్తుంది. ఇది హర్యానా ముర్రా జాతికి చెందిన దున్నపోతు. ఈ దున్నకు దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉంది.

Written By Renuka Godugu
Published: Nov 08, 2026, 06:36 PM IST | Updated: Nov 08, 2026, 06:38 PM IST
Image Credit: Hyderabad Sadar Festival 2026:
Join

Hyderabad Sadar Festival 2026: రెండు రోజుల్లో జరగబోయే యాదవుల అత్యంత పెద్ద పండుగ సదర్‌కు ఇప్పటికే అన్ని చోట్లా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.  ఈ వేడుకలను ఏర్పాటులో లడ్డు యాదవ్ ఉన్నారు. ఎన్నేళ్ల నుంచో సదర్ సంస్కృతిని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈసారి ఈ ప్రత్యేకత ఏమిటి? అని ఫస్ట్ జీ ఛానల్ వారు ప్రశ్నించగా, ప్రత్యేకంగా దీపావళి సదర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా సదర్ 10వ తారీఖు సాయంత్రం 8:30 నుంచి 9 గంటల మధ్య మా బయలుదేరు ప్రాంతమైన నారాయణగూడ నుంచి మొదలవుతుందని, కులాలకు, పార్టీలకు అతీతంగా ఈ పండుగను జరుపుతామని చెప్పారు.

ఈ సదర్‌ను హైదరాబాద్‌లో ఎన్నేళ్ల నుంచో నిర్వహిస్తున్నారు. 30-35 ఏళ్ల క్రితమే మా పెద్దలు దీన్ని ప్రారంభించారు. మా పెద్దలు చేస్తున్నప్పుడు మేము చిన్నవాళ్లం, అప్పట్లో ఐదు రూపాయలతోనే సరిపెట్టుకునేవాళ్లం. ఇప్పటి ఖర్చులు అప్పటికంటే వెయ్యి రెట్లు పెరిగినట్టు అనిపిస్తోంది. మీ భావి తరాలకు కూడా ఈ సంస్కృతిని నేర్పిస్తున్నారా అంటే, 100% నేర్పిస్తున్నామని చెప్పగలను. మా కంటే ఇంకా బాగా చేయాలని మా పిల్లలకు చెబుతున్నాం. వాళ్లు ఇప్పుడు మా వెంటే ఉంటూ నేర్చుకుంటున్నారు. "ఇలా కాదు, ఇలా చేయాలి" అని మేము చూపిస్తున్నాం; 90% మంది చేసేదాన్ని, మేము 10% మాత్రమే చెబుతున్నామన్నారు.

ఈసారి రేవంత్ రెడ్డి ఐదు కోట్ల రూపాయలు ప్రకటించారు. గత ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించలేదు. రేవంత్ రెడ్డి వచ్చాక ఇది రాష్ట్ర పండుగగా ప్రకటించారు. యాదవుల పండుగ సదర్‌ను రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసినందుకు అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్‌లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. గతంలో పురుషులు మాత్రమే సదర్‌లో బయట కనిపించేవారు. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా బయటికి వస్తున్నారు, సదర్ తీస్తున్నారు. 100% మా ఇంట్లోని ఆడపిల్లలు కూడా దున్నపోతును పట్టుకుంటారు. చిన్నప్పటి నుంచి చూసినవాళ్లే; యాదవుల ఇళ్లలో ఆడపిల్లలు కూడా తప్పనిసరిగా ఇందులో పాల్గొంటారు.

ప్రభుత్వాన్ని ఇప్పుడు మహిళా కుటుంబాలు, యాదవ కుటుంబాలు ఏమి అడుగుతారు అంటే, అనిల్ కుమార్ యాదవ్ ఒక ప్రణాళిక వేస్తున్నారు. ఎవరికి ఎంత ఇవ్వాలి, తెలంగాణ జిల్లాలకు ఎలా పంచాలి? ఈ డబ్బులు ఎలా ఇవ్వాలి అనే ప్రణాళికను వారు రూపొందిస్తారు. వారు ఏ ప్రణాళిక వేసినా దానికి మేము కట్టుబడి ఉంటాం. ప్రస్తుతం పశువుల పోషణ పరిస్థితి బాగా లేనట్టుంది; ఎండల ప్రభావమూ కనిపిస్తోంది. నీళ్లు లేవు, గడ్డి లేదు, ఎండలు పెరగబోతున్నాయి; మరి పశువుల పరిస్థితి ఏమిటి? మేము ప్రతిరోజూ దేవుడిని ప్రార్థిస్తున్నాం,వర్షాలు పడాలని, పాడి పరిశ్రమ బాగుండాలని, రైతులకు ఇబ్బంది కలగకూడదని. దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో చూద్దామన్నారు.

10వ తేదీన జరిగే ఈ సదర్ కార్యక్రమంలో కాచిగూడ చెప్పల్ బజార్ నుంచి నారాయణగూడ వరకు పెద్ద ఎత్తున ఊరేగింపు ఉంటుంది. అందరూ ఈ సదర్ కార్యక్రమంలో పాల్గొనాలి, అలాగే ఇంటికి కూడా మంచిని చేర్చుకోవాలని కోరుతున్నామని నిర్వహకుడు సందీప్‌ అన్నారు. సదర్ ఉత్సవాలు అంటే ఒక దున్నపోతు, హాకీ స్టిక్, రోడ్ల మీద హంగామా. అసలు సదర్ చరిత్ర ఏంటి, అది ఈ తరం యువతకు తెలుసా? పూర్వీకులు ఈ తరం యువతకు అసలు సదర్ ఉత్సవాలను ఎందుకు జరుపుకుంటారు అనే సందేశాన్ని ఇస్తున్నారా? అసలు ఈ సందేశం అనేది చాలా పెద్ద మనుషులకు, ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే తెలుసు.

ఇందులో రెండు విధాలుగా ఉంది. ఒకటేమో, ఈ కార్యక్రమం యూత్‌కి, ఇప్పుడున్న వారికి అందరికీ కూడా, సదర్ అంటే పెద్ద ఎత్తున డీజే వాయిద్యాలు, లైటింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉండే కార్యక్రమం అని. ఈ జనరేషన్ పరంగా వాళ్లందరూ ఆ విధంగా, మ్యూజికల్‌గా ఆలోచిస్తారు. కానీ సదర్ అంటే, పూర్వం పెద్దలు అందరూ ఒక చోటికి చేరుకుని ఒక అలైబలే కార్యక్రమం నిర్వహించుకోవడం. తమ తమ వ్యాపార వృత్తి, జీవనాధారం కొనసాగించే గేదలు, పశు సంతతి మీద గౌరవాన్ని చూపించే దిశగా, ఈ 365 రోజులలో ఒకరోజు వాటిని కూడా గౌరవిస్తూ, జులూస్‌గా బయలుదేరుతారు. పెద్దలు నిర్వహించిన స్టేజ్ దగ్గర చేరుకుని అలైబలై కార్యక్రమం చేసుకుని, వాటి ఇంటి సంతతి దున్నపోతును ఒక ప్రైడ్‌గా చూయించుకుని తీసుకురావడం జరుగుతుందన్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES