• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /KBR Park Flyover Project: కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్లపై కీలక నిర్ణయం.. పాత పనులకు బ్రేక్, కొత్త డిజైన్లకు గ్రీన్ సిగ్నల్

KBR Park Flyover Project: కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్లపై కీలక నిర్ణయం.. పాత పనులకు బ్రేక్, కొత్త డిజైన్లకు గ్రీన్ సిగ్నల్

KBR Park Flyover Project: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రతిపాదించిన రూ.1,020 కోట్ల ఫ్లైఓవర్ ప్రాజెక్టు పరిధిలో భారీ మార్పులు చేసింది. పూర్తి వివరాలు ఇలా..

Written ByAshok Krindinti
Published: Oct 06, 2026, 05:58 PM IST|Updated: Oct 06, 2026, 06:01 PM IST
joinshare
KBR Park Flyover Project: కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్లపై కీలక నిర్ణయం.. పాత పనులకు బ్రేక్, కొత్త డిజైన్లకు గ్రీన్ సిగ్నల్
Image Credit: KBR Park Flyover Project

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
KBR Park Flyover Project: కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్లపై కీలక నిర్ణయం.. పాత పనులకు బ్రేక్, కొత్త డిజైన్లకు గ్రీన్ సిగ్నల్

KBR Park Flyover Project: కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్లపై కీలక నిర్ణయం.. పాత పనులకు బ్రేక్, కొత్త డిజైన్లకు గ్రీన్ సిగ్నల్

2

Indiramma Towers: హైదరాబాద్‌ ప్రజలకు తెలంగాణ మంత్రి శుభవార్త.. ఇందిరమ్మ టవర్స్‌పై కీలక అప్‌డేట్‌

3

అరటిపండు ఉదయం లేదా సాయంత్రం.. ఏ సమయంలో తింటే శరీరానికి ఎక్కువ శక్తి వస్తుంది?

4

భారత్ vs వెస్టిండీస్ తొలి టీ20: శ్రేయస్ సేనకు అసలైన పరీక్ష.. ఓపెనింగ్‌‌పై కొనసాగుతున్న ఉత్కంఠ..!

5

Tirumala: భక్తులకు బంపర్ శుభవార్త.. రేపు తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. పూర్తి వివరాలు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

KBR Park Flyover Project: హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన ప్రతిష్టాత్మక కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న ఫ్లైఓవర్ పనుల పరిధిని భారీగా మారుస్తూ.. సుమారు రూ.1,020 కోట్ల వ్యయంతో కూడిన సవరించిన ప్రతిపాదనలకు పరిపాలనా పరమైన ఆమోదం తెలిపింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.

సవరించిన పనుల వివరాలు ఇలా..

జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ముఫకంజా కాలేజీ వరకు నూతన ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
బంజారాహిల్స్ రోడ్ నంబర్–1కు అనుసంధానంగా ప్రత్యేక కనెక్టింగ్ ర్యాంప్‌ను ఏర్పాటు చేయనున్నారు.
కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, ముగ్ధ జంక్షన్, రోడ్ నంబర్–45, ఫిల్మ్‌నగర్, మహారాజా అగ్రసేన్ జంక్షన్లతో పాటు క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ పరిసరాల్లో చేపట్టే పనుల డిజైన్లు, పరిధిని సవరించారు.

ఈ ప్రతిపాదనలు రద్దు..

పంజాగుట్ట స్మశాన వాటిక, ఎన్‌ఎఫ్‌సీఎల్ (NFCL) జంక్షన్లలో గ్రేడ్ సెపరేటర్ల పనులను రద్దు చేశారు.
పంజాగుట్ట స్మశాన వాటిక జంక్షన్ వద్ద ప్రతిపాదించిన 3-లేన్ యూని-డైరెక్షనల్ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని రద్దు చేశారు.
ఎన్‌‌ఎఫ్‌సీఎల్ జంక్షన్‌లో 2-లేన్ యూని-డైరెక్షనల్ ఫ్లైఓవర్‌తో పాటు, బంజారాహిల్స్ పరిధిలోని 2-లేన్ యూని-డైరెక్షనల్ అండర్‌పాస్ పనులను కూడా పూర్తిగా పక్కన పెట్టారు.

ప్రాజెక్టు కాంట్రాక్ట్ కేటాయింపుల్లోనూ ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ పనులను ప్రముఖ నిర్మాణ సంస్థ 'మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్' (MEIL)కు అప్పగించేందుకు అనుమతి మంజూరు చేసింది. గతంలో 'కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్' (KNR)కు జారీ చేసిన లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ (LOA)ను రద్దు చేస్తూ.. టెండర్ సమయంలో వారు చెల్లించిన డిపాజిట్లను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. సవరించిన డిజైన్ల ప్రకారం ప్యాకేజీ–1, ప్యాకేజీ–2 పనులను వేగవంతం చేయాలని.. ప్రాజెక్ట్ పనుల పర్యవేక్షణ కోసం సబ్‌స్టిట్యూటింగ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ల (PMC) సేవలను యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telugu News
Telangana News