• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • / హైదరాబాద్‌‌లో ఈ రెస్టారెంట్లకు వెళితే..!! రెస్ట్ ఇన్ పీసే..!!

హైదరాబాద్‌‌లో ఈ రెస్టారెంట్లకు వెళితే..!! రెస్ట్ ఇన్ పీసే..!!

Food Safety Insepection: హైదరాబాద్‌లోని ఫుడ్ సేఫ్టీ అధికారులు మొద్దు నిద్రను వీడారు. గత కొన్నేళ్లుగా ప్రజలకు అపరిశుభ్ర ఆహారాన్ని అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటల్ నిర్వాహకులకు షాక్‌లు ఇచ్చారు. ఏకంగా హైదరాబాద్‌లో 11 రెస్టారెంట్ల లెసెన్స్ రద్దు చేశారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Sep 27, 2026, 11:27 AM IST|Updated: Sep 27, 2026, 11:29 AM IST
joinshare
 హైదరాబాద్‌‌లో ఈ రెస్టారెంట్లకు వెళితే..!!  రెస్ట్ ఇన్ పీసే..!!
Image Credit: Food Adulteration (File Pics/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Food Adulteration: కాదేది కల్తీకి అనర్హం అన్నట్టు విశ్వనగరంగా పేరొందిన భాగ్యనగర ప్రజలు ఆహార కల్తీ బెడదను ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా వేలాది రెస్టారెంట్స్, చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి. వాటిని ఎప్పటికపుడు తనిఖీ చేస్తూ ఆహార భద్రతా నియమాలను పాటిస్తున్నారా అనే విషయాన్ని నిరంతరం ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలించాలి. కానీ అధికారుల్లో కొంత మంది రెస్టారెంట్స్, హోటల్స్ వాళ్లు ఇచ్చే మాముళ్లకు కక్కుర్తి పడి అన్నింటికి ఎన్‌ఓసీ సర్టిఫికేట్స్ ఇచ్చేస్తున్నారు.

హోటల్ కిచెన్ పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అక్కడ సిబ్బందితో పాటు హోటల్ యాజామాన్యానికి వుంది. అంతేకాదు మన దగ్గర చాలా హోటల్లో నిన్న, మొన్నతో పాటు వారం రోజులుగా  మిగిలి పోయిన ఆహారాన్ని ఫ్రిజ్లో రోజుల తరబడి నిల్వ ఉంచి వాటినే వేడి చేసి ప్రజలకు వండి వారుస్తున్నారు. ఆయా ఆహారా పదార్ధాలు  కుళ్లి పోకుండా ఉండడానికి కొన్ని ప్రమాదకర రసాయనాలను వాడుతున్నారు.   కొంత మంది ఇలా నిల్వ ఉన్న ఆహారాన్ని ఒదిలించుకోవడానికి ఫుడ్ యాప్స్‌లో తక్కువ డిస్కౌంట్‌కు ఆపర్స్  పెడుతున్నారు.  ప్రజలు అది తెలియక.. పాత పాచిపోయిన ఆహారాన్ని యాప్‌లలో తక్కువ రేటుకు వస్తుంది కదా అని ఎంచక్కా  ఫుడ్ కు సంబంధించిన కొన్ని యాప్స్ ‌లో ఆర్డర్ ఇచ్చుకొని మరి రోగాలను కొని తెచ్చుకుంటున్నారు.

మధ్య మధ్యలో ఏదో హడావుడిగా మొక్కుబడిగా ఆహార భద్రతా అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తూ కొన్ని హోటల్స్‌ను  సీజ్ చేస్తూ మేము పనిచేస్తున్నామని బిల్డప్ ఇచ్చుకుంటున్నాయనే వాదన సామాన్యుల నుంచి వినబడుతున్న మాట.  మొత్తంగా విశ్వ నగరంగా పేరొందిన హైదరాబాద్‌ను నకిలీ ఆహార బెడద తీవ్రంగా వెంటాడుతోంది.మొత్తంగా 89 శాతం మంది తమ జీవితంలో ఎప్పుడో ఒకసారి నకిలీ ఆహారం బారిన పడినట్టు కొన్ని నివేదికలు చెబుతున్న మాట.

తాజాగా హైదరాబాద్‌లో 11 రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు..

హైదరాబాద్‌లో ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘించిన మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లోని 11 హోటళ్లు, రెస్టారెంట్ల లైసెన్సులను ఫుడ్ సేఫ్టీ అధికారులు రద్దు చేశారు. వీరి తనీఖీల్లో కుళ్లిన, గడువు ముగిసిన ఆహార పదార్థాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

మొనాస్ట్రీ, కోల్ స్పార్క్, కాంచి కేఫ్‌, అల్‌సబా, శివాని బార్ అండ్ రెస్టారెంట్‌ తదితర సంస్థలపై చర్యలు తీసుకున్నారు.వీటితో పాటు లక్కీ, ఉడిపీస్ ఉపహార్‌,  ఫ్యూజన్ 9, అమ్నీషియా స్కైబార్‌ అంతెరా కిచెన్ అండ్ బార్‌, సాయిరాం మెస్‌, అమ్ ఆహా తెలుగు కిచెన్‌, తదితరాల లైసెన్సులు రద్దు చేసినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. అయితే ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఈ రెస్టారెంట్స్‌ను శాశ్వతంగా మూసేసి దానికి సంబంధించిన యజమానులకు శాశ్వతంగా ఫుడ్ లైసెన్స్ వంటివి జారీ చేయకుండా తగిని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది సామాన్యలు మాట. కానీ డబ్బు, పలుకుబడి ఉన్న వీళ్లు  రాజకీయ నాయకుల ద్వారానో అధికారులకు ముడుపులు ఇచ్చి మళ్లీ తమ హోటల్ లైసెన్స్‌ను తిరిగిపొందుతున్నారు. 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Hyderabad
Telangana News