Rajagopal Reddy: ఖబడ్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతుంది.. సీఎం రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..
Rajagopal Reddy fires on Cm Revanth: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతే కాకుండా మూడేళ్ల పాలనలో ప్రజలు సంతోషంగా లేరని ఎద్దేవా చేశారు.
Raja gopal reddy slams on cm revanth reddy govt: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో తరచుగా ఆయన సొంత పార్టీ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.ఇప్పటికే తన నియోజకవర్గం మునుగోలుకు నిధులు కేటాయించడంలేదని తరచుగా మండి పడుతున్నారు.ఈ క్రమంలో తాజాగా.. మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. స్థానికంగా ఏర్పటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ భాషపై సెటైర్లు వేశారు.
కొడంగల్‌కు రూ.10 వేల కోట్లు తీసుకపోతుండంటడా.. ఎవడాడు.. పండబెట్టి తొక్కుతా అని మాట్లాడారని, అసలు ఆ భాష ఏంటని ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడితే కొడంగల్ అంటాడు.. ఉత్తమ్ ఏమో హుజుర్ నగర్ అంటారు..?.. మరీ మా సిట్యువేషన్ ఏంటని మండిపడ్డారు. నేను అడిగినదాంట్లో తప్పేముందునిఅన్నారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఖబడ్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతుందని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.
మూడేళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని విమర్శించారు. తెలంగాణ అంటే కొడంగల్, మధిర మాత్రమే కాదని.. ప్రభుత్వంలోని నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని తెల్చి చెప్పారు. కాంట్రాక్టు టెండర్ విలువ చెప్పాలని, దానికంటే 20 శాతం తక్కువకే టెండర్ వేసి ప్రజాధనాన్ని కాపాడుతానని, ప్రజల సొమ్ము తినే వ్యక్తిని కాదని వ్యాఖ్యానించారు.
మునుగోడుకు నిధులివ్వకపోతే మరో కురుక్షేత్రమే’.. అంటూ మండిపడ్డారు. పింఛన్ రూ.2 వేలే కాదు.. రూ.5 వేలు ఇచ్చినా తప్పులేదన్న రాజగోపాల్ రెడ్డివ్యాఖ్యానించారు. నీకు అధికారం ఉంది కదా అని.. నేను ఏం చేసినా నడుస్తది అనుకుంటే ఖబర్దార్ బిడ్డా అంటూ ఫైర్ అయ్యారు. నీ అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయ్యావని, ఇంకా రెండేళ్లు టైం ఉంది.. మంచిగా పని చెయ్యి అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంను ఏకీపారేశారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగొపాల్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.