• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /Hostels Close: హైదరాబాద్‌లో నీటి సంక్షోభం.. జనవరిలో హాస్టల్స్‌, పీజీలు మూసివేత?

Hostels Close: హైదరాబాద్‌లో నీటి సంక్షోభం.. జనవరిలో హాస్టల్స్‌, పీజీలు మూసివేత?

KPHB Hostels And PGs Likely To Close On January With Effect Of Elnino: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో హైదరాబాద్‌లో నీటి సంక్షోభం రాబోతున్నది. ఇప్పటికే ప్రభుత్వం నీటిని పొదుపుగా వాడాలని సూచిస్తుండగా.. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో హాస్టల్స్‌, పీజీలు మూతపడే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 18, 2026, 16:30 IST|Updated: Nov 18, 2026, 16:37 IST
joinshare
Hostels Close: హైదరాబాద్‌లో నీటి సంక్షోభం.. జనవరిలో హాస్టల్స్‌, పీజీలు మూసివేత?
Image Credit: KPHB Colony Hostels And PGs

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

KPHB Colony Hostels Association: వర్షాభావ పరిస్థితులతో తెలంగాణలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే వర్షాలు లేక జల వనరులు ఎండిపోయి వెలవెలబోతున్నాయి. కురిసిన వర్షాలకు ప్రభుత్వం ప్రాజెక్టుల్లో నీళ్లు ఎత్తిపోయకపోవడంతో నీటి ఎద్దడి మరింత తీవ్రమైంది. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం నీటి పొదుపు చర్యలు సూచించింది. నీటి సంక్షోభం తీవ్రస్థాయికి చేరితే హాస్టల్స్‌, పీజీలు మూసివేస్తామని యజమానులు ప్రకటించారు. జనవరి, ఫిబ్రవరిలో హాస్టళ్లు మూసివేస్తామని హాస్టల్‌ యజమానుల సంఘం తెలిపింది.

హైదరాబాద్‌లో కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీలో పెద్ద ఎత్తున హాస్టళ్లు, పీజీలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో హాస్టళ్ల నిర్వహణ రోజురోజుకూ భారంగా మారుతోంది. కేపీహెచ్‌బీ కాలనీలో నీటి ఎద్దడి ఏర్పడడంతో హాస్టళ్లు మనుగడ సాగించలేని పరిస్థితి ఏర్పడింది. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత తీవ్రరూపం దాల్చుతోందని.. బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని హాస్టల్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

'గతంలో రూ.1,000గా ఉన్న నీటి ట్యాంకర్ ఖర్చు ప్రస్తుతం రూ.2500 వేల నుంచి రూ.5 వేల వరకు పెరిగింది. అయినా కూడా నీటి ట్యాంకర్ లభించని పరిస్థితి' అని హాస్టల్స్‌ యజమానుల సంఘం తెలిపింది. సుమారు 50 కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తీసుకురావాల్సి వస్తోందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ బిల్లులు, వంట నూనెలు, నిత్యావసర సరుకులు, ఇతర ముడిసరుకుల ధరలు భారీగా పెరిగాయని చెప్పారు.

'నీటి కొరత ఏర్పడడంతో హాస్టళ్లలో నీటి పొదుపు చర్యలు పాటిస్తున్నారు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, కోచింగ్ అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు సంబంధించి సర్క్యులర్లు జారీ చేయడంతో హాస్టళ్ల ఆక్యుపెన్సీపై ప్రభావం పడుతోంది' అని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని భవన యజమానులు అద్దెలు తగ్గించి సహకరించాలని హాస్టల్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే జనవరి, ఫిబ్రవరి నుంచి హాస్టళ్లకు తాళాలు వేసి భవనాల తాళాలను యజమానులకు అప్పగిస్తామని అసోసియేషన్ హెచ్చరించింది.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Hyderabad
Telangana News